ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వాన్ని నమ్మడం లేదు. జీతాలిస్తామన్నా నమ్మడం లేదు డీఏలు ఇస్తామన్నా నమ్మడం లేదు . చివరికి ప్రమోషన్లు ఇస్తామన్నా నమ్మడం లేదు. మాకు నమ్మకం లేదు దొరా అని..వారి దారిన వారు వెళ్లిపోతున్నారు. సచివాలయ ఉద్యోగులు అయితే ఇప్పటి వరకూ తీసుకున్న జీతం కూడా కట్టేసి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం టీచర్లకు ప్రమోషన్లు ఇస్తామని వ్యవహారం నడుపుతోంది. గతంలో అయితే ప్రమోషన్లు అనగానే పరుగులు పెట్టుకుంటూ టీచర్లు వచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ప్రమోషన్లు నమ్మడం అంటే మన చెప్పుతో మనం కొట్టుకున్నట్లేనని ఊరుకుంటున్నారు.
గతంలో ప్రమోషన్ల పేరుతో ఇలా ఉపాధ్యాయుల్ని వేరే చోటకు పంపారు.కానీ తర్వాత అవి ప్రమోషన్లు కాదన్నారు. అందుకే ఇప్పుడు ఎవరూ నమ్మడం లేదు. ఉన్న ఉద్యోగం.. ఉన్న జీతం ఇస్తే చాలని వారు మిన్నకుండి పోతున్నారు. ఇక సచివాలయ ఉద్యోగుల గురించి చెప్పాల్సిన పని లేదు. ఎరక్క పోయి వచ్చామన్నట్లుగా చాలా మంది గుడ్ బై చెప్పి వెళ్లిపోతున్నారు. సచివాలయ ఉద్యోగాల్లో చేరిన వారు వెళ్లిపోకుండా చాలా నిబంధనలు పెట్టారు. ఒక వేళ వెళ్లాలంటే అప్పటి వరకూ తీసుకున్న జీతం మొత్తం చెల్లించాలి. అయినా సరే మొత్తం ఇచ్చేసి ప్రభుత్వానికి నమస్కారం పెట్టేసి వెళ్లిపోతున్నారు. ఇది పదివేల మంది వరకూ వెళ్లిపోయారు.
ప్రభుత్వాన్ని ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితి లేదు. జీతాలే సక్రమంగా ఇవ్వని పరిస్థితుల్లో ప్రొబేషన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటేనని వారనుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కదా అని సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను కూడా వదిలేసి వచ్చిన వారు ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అన్నివర్గాలతో పాటు ఉద్యోగులనూ ప్రభుత్వం అడ్డగోలుగా మోసం చేసింది. చివరికి రియలైజ్ అవుతున్నారు. ఉద్యోగుల తీరు చూసి.. రేపోమాపో మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లు ఉద్యోగుల ముఖం మీద వేయిస్తారన్న సెటైర్లు సహజంగానే పేలుతున్నాయి.