ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా ఏర్పాటయింది. ఆ రాజ్యాంగాన్ని … రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించకపోతే అసలు తన ఉనికిని తాను ప్రశ్నించుకున్నట్లే. అందుకే గతంలో ప్రభుత్వం ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థల నుంచి ఓ చిన్న విమర్శ వచ్చినా సరే తప్పు చేశామని భావించి పదవులు వదులుకోవడానికి సిద్ధపడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగం అనేదానికి లేనిపోని అర్థాలు తీసుకుని కోర్టులను కూడా లెక్క చేయకుండా పాలన చేయడం కామన్ అయిపోయింది. ప్రతీ దాంట్లోనూ వక్రీకరణే..అబద్దాలే.
చట్టవిరుద్ధ పాలనకు నిట్టనిలువు సాక్ష్యం !
ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ఓ హైకోర్టు న్యాయమూర్తి భావించారు. ఈ మేరకు ఆయన పరిశీలన చేయించాలని అనుకున్నారు. కానీ ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం ఎలాగోలా ఆ ఉత్తర్వులు నిలువరించుకోగలిగింది రాజ్యాంగ విచ్ఛిన్న పాలన జరగకపోతే ప్రభుత్వం ఎందుకు అంత టెన్షన్ పడాలి.. అసలు న్యాయమూర్తి అలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి ఎన్ని రకాల ఉదాహరణలు ఉన్నాయో ఎందుకు ఆలోచించదు ?. పాలన చేపట్టినప్పటి నుండి రాజ్యాంగ ఉల్లంఘన పాలనే. ఒక్కటంటే.. ఒక్కటీ పారదర్శకంగా ఉండదు. అన్నీ రహస్యమే. బాధితులు కోర్టుకెళ్తారేమో అని జీవోలు కూడా దాచే దౌర్భాగ్య పాలన.
కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధికారులు !
స్కూళ్లలో ఆర్బీకే..సచివాలయాలు కట్టవద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ అధికారులు కట్టేశారు. దీంతో కొత్తగా సీఎస్ అయిన జవహర్ రెడ్డి తమ ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. నిజానికి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవడం తలవంపులుగా భావించాలి. ఎందుకంటే న్యాయవ్యవస్థను గౌరవించని ప్రభుత్వం అధికారంలో ఉండటానికి వీల్లేదు. కానీ ప్రభుత్వం కోర్టు చెప్పేదేంటి.. మేం చేసేదేంటి..అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ ఒక్క విషయంలోనే కాదు.. కోర్టు్ల్లో పేరుకుపోతున్న కొన్ని వేల కోర్టు ధిక్కార పిటిషన్లే దీనికి సాక్ష్యం. అలాగే… కోర్టు ఎదుట హాజరువుతున్న శిక్షలకు గురవుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంక్షే తార్కారణం. ఇంత కంటే రాజ్యాంగ విరుద్ధ పాలన ఇంకొకటి ఉంటుంది.
వేలల్లో కోర్టు ధిక్కరణ అభియోగాలా ? కనీసం సిగ్గుపడరా ?
ప్రభుత్వంపై కొన్ని వేలల్లో కోర్టు ధిక్కరణ పటిషన్లు హైకోర్టులో పడుతున్నాయి. రోజూ..వందల సంఖ్యలో వస్తున్నాయి. ఇలా ఎందుకు వస్తున్నాయంటే..కోర్టు చప్పేదేంటి.. మేం చేసేదేంటి అని .. అనుకోవడమే. అలా అనుకున్పన్పుడు అధికారంలో ఉండే అర్హత ఉండదు. కానీ దర్జాగా తాము చేయాల్సింది చేస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారంలో ఎంత దారుణంగా వ్యవహరించాలో అంతా చేస్తున్నారు. అయినా సిగ్గుపడటం లేదు. వ్యవస్థల్ని ధిక్కరించడం.. తమ నైజం అనుకుంటున్నారు.
ప్రభుత్వం చేతిలో పోలీసులు ఉన్నారు. చట్టం ఉంది. తాము ఏది చేస్తే అదే పాలన అనుకునే మనస్థత్వం ఉన్న వాళ్లు పాలకులయ్యారు. అందుకే ఏపీకి ఈ ఖర్మ పట్టింది.