ఆంధ్రప్రదేశ్లో …. మొదటి విడతలోనే.. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. సంప్రదాయంగా చూస్తే.. ప్రతీ సారి… చివరి విడతల్లో మాత్రమే… ఏపీ, తెలంగాణ ఎన్నికలు ఉంటాయి. ఈ సారి దక్షిణాదిలో మొదట ఎన్నికల్ని పూర్తి చేయాలనుకున్నారు. అదీ మొదటి విడతలోనే పూర్తి చేశారు. దీని వెనుక బీజేపీ వ్యూహం ఉందని… చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు తగినంత సమయం ఇవ్వకూడదన్న లక్ష్యంతో.. ఇలా చేశారని చెప్పుకున్నారు. కానీ.. చంద్రబాబు.. అన్నీ అనుకున్నట్లుగా పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు.. ఏపీ పరంగా.. తను చేయాల్సింది చేశారు.. ఢిల్లీలో ల్యాండయ్యారు. తన పూర్తి సమయాన్ని.. ఇతర పార్టీల కోసం కేటాయించబోతున్నారు. బీజేపీయేతర పార్టీల కోసం… ప్రచారం సహా.. వ్యూహాల్ని ఖరారు చేయబోతున్నారు. మోడీ నేతృత్వంలో దేశంలో ఎంత తిరోగమనంతో ఉందో.. మోడీ వల్ల దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే అంశాన్ని హైలెట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికీ… ఇంకా … ఆరు విడతలకుపైగా పోలింగ్ ఉంది. బీజేపీ కీలకంగా పోటీ పడుతున్న రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. చంద్రబాబు.. ఆయా రాష్ట్రాలకు వెళ్లి… పార్టీలకు ప్రచారం చేయాల్సిన పని లేదు. కానీ.. ఏపీలో… ఎన్నికలు జరిగిన తీరును.. మీడియా సాక్షిగా హైలెట్ చేస్తే సరిపోతుంది. చంద్రబాబు అదే చేస్తున్నారు. పైగా… తెలుగువారు ఉన్న చోట.. ఆయన అవసరం ఉన్న చోట.. జాతీయ నేతలు ఎలాగూ ప్రచారానికి పిలుస్తారు. కర్ణాటకలో ప్రచారానికి రావాలని… దేవేగౌడ ఇప్పటికే ఆహ్వానించారు. కర్ణాటకలో… తెలుగు ప్రజల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో.. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉంటారు. కర్ణాటక ఎన్నికల్లో చంద్రబాబు పిలుపునివ్వడం వల్ల…. అక్కడి ఓటర్లు ఓట్లు వేయలేదని.. దాని వల్లే బీజేపీ ఓడిందనే ప్రచారం ఎలాగూ ఉంది.
రాజకీయ వ్యూహచతురలతో.. చంద్రబాబు ఎప్పుడో… డాక్టరేట్ చేశారు. ఆ విషయం జాతీయ నేతలందరికీ తెలుసు. ఆయన వ్యూహత్మకత గురించి పార్టీలన్నింటికీ తెలుసు కాబట్టి… చంద్రబాబు సేవలను ఉపయోగించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు బీజేపీ నేతలు నాలిక్కరుచుకుంటున్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో వేలు పెడుతున్నారని తెలిసి కూడా… ఆయనను…. ఖాళీగా ఉంచేలా.. ఎన్నికల షెడ్యూల్ రూపొందించి.. వ్యూహాత్మక తప్పిదం చేసుకున్నామనే భావనలో బీజేపీ నేతలు పడిపోయారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఆరు వారాలు.. చంద్రబాబు… పూర్తిగా.. మోడీపైనే దృష్టి కేంద్రీకరించబోతున్నారు. బీజేపీయేతర పార్టీల మధ్య సమన్వయం తీసుకొచ్చే విషయంలో చంద్రబాబు.. కీలకంగా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది బీజేపీకి… ఇబ్బంది కలిగించే విషయమే.