దావోస్ నుంచి చంద్రబాబు, లోకేష్ ఉత్త చేతులతో వచ్చారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవం మాత్రం వేరే ఉందని.. దావోస్లో ఏపీకి కూడా భారీ పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని తెలంగాణ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నారు. దావోస్ పర్యటనపై హైదరాబాద్లోని మీడియాతో మాట్లాడిన తర్వాత మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా దావోస్లో ఏపీ ఎందుకు ఒప్పందాలు చేసుకోలేదన్నదానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్లో ఏపీకి భారీగా పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని.. కానీ వ్యూహాత్మకంగానే బయట పెట్టలేదని శ్రీధర్ బాబు చెప్పారు.
పెట్టుబడులకు దావోస్లో ఒప్పందాలు చేసుకోవడం కన్నా.. వారిని తమ రాష్ట్రానికి పిలిచి అక్కడే ఒప్పందాలు చేసుకుంటే మంచి ప్రచారం లభిస్తుందన్నారు కారణంగానో లేకపోతే.. ఎంవోయూలు కాకుండా..పూర్తి స్థాయిలో మెటీరియలైజ్ అయ్యేలా చేసుకునే ప్రయత్నంలో భాగంగానో బయట పెట్టలేదని శ్రీధర్ బాబు అంటున్నారు. ఏపీకి బోలెడంతో అడ్వాంటేజ్ ఉందని.. తీరంతో పాటు పలు రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయని శ్రీధర్ బాబు గుర్తు చేస్తున్నారు. పెట్టుబడులు రాకపోవడం అనేది లేదని.. త్వరలో లోకేష్, చంద్రబాబు వ్యూహం ఏమిటో తెలుస్తుందని శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
తెలంగాణ పరిశ్రమల మంత్రి మాటల ప్రకారం చూస్తే.. దావోస్లో ఎంవోయూలు చేసుకోవాల్సిన వారంతా ఏపీలోనే ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు దావోస్ నుచి రూపాయి కూడా తేలేదని ఆరోపించే వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇప్పుడు వారు అదే పనిగా ఆవేశపడుతున్నారు కానీ.. చంద్రబాబు, లోకేష్ అసలైన రాజకీయాలు చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారన్న సెటైర్లు శ్రీధర్ బాబు వ్యాఖ్యల తర్వాత వినిపిస్తున్నాయి.