ఏపీ కి రావాల్సిన విద్యుత్ బకాయిలను కేసీఆర్ సర్కార్ చెల్లించకపోవడంతో టీడీపీ హయాంలో తెలంగాణ విద్యుత్ సంస్థలపై ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణ జరిగి ఉంటే… ఖచ్చితంగా బకాయిలు చెల్లించి ఉండేవారు.. లేకపోతే తెలంగాణ విద్యుత్ సంస్థలను దివాలాగా ప్రకటించి ఉండేవారు. జగన్ సర్కార్ రాగానే… అసలు డబ్బులు ఇస్తామని అంగీకరించకపోయినా … దివాలా పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఇప్పటి వరకూ కేంద్రం ఆ డబ్బులు ఇవ్వకపోగా ఎదురుదాడి చేస్తోంది.
ఎన్సీఎల్టీలో పిటిషన్ ఉపసంహరించుకోవడం… కేసీఆర్ సర్కార్.. విద్యుత్ బకాయిలు తీర్చేది లేదని మొండికేస్తూండటంతో .. ప్రజల ఇదేం మోసం అంటారని చివరికి కోర్టులో వివాదాన్ని పెట్టారు. అసలు కోర్టుకు వెళితే ఆ సమస్య అక్కడ ఉండిపోతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం …. ఆ నిధుల్ని ఇతర మార్గాల్లో పరిష్కరించుకోవాలి.. కానీ కోర్టుకెళ్లి వివాదం తెగకుండా చేశారు. రివర్స్‌లో తెలంగాణ కూడా న్యాయపోరాటం చేస్తోంది. నిజానికి కోర్టుకు వెళ్లకపోతే.. .. విభజన చట్టం ప్రకారం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నేరుగా ఆర్బీ ఐ ద్వారా తెలంగాణ నుంచి నిధులు వసూలు చేసుకునే అవకాశం ఉండేది.
కానీ ఇప్పుడు విషయం కోర్టులో ఉండటం వల్ల.. తెలంగాణ సర్కార్ వెంటనే కోర్టుకు వెళ్లి.. విద్యుత్ బకాయిల విషయంలో తమపై దూకుడుగా చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు తెచ్చుకున్నారు. ఏపీ విద్యుత్ బకాయిలను తెలంగాణ నుంచి నేరుగా ఆర్బీఐ ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తామని కేంద్రం ద్వారా పార్లమెంట్ లో వైసీపీ వ్యూహాత్మకంగా చెప్పించింది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయి.. అలాంటి ఉత్తర్వులు తెచ్చింది. ఏ విధంగా చూసినా ఏపీ ప్రయోనాజల కన్నా ఇతర ప్రయోజనాలు… పొరుగు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికే జగన్ రెడ్డి సర్కార్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం నిపుణుల్లో వినిపిస్తోంది.