ఉద్యోగులతో అవసరం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కానీ ఇప్పటికప్పుడు మోసం చేస్తోంది. గతంలో పీఆర్సీ వివాదం తలెత్తినప్పుడు ఇస్తామని ప్రకటించిన హామీల్లో దాదాపుగా ఏమీ నెరవేర్చలేదు. కొన్నింటికీ జీవోల ఇచ్చారు. మరికొన్నింటికీ అదీ దిక్కు లేదు. ఇంకా విశేషం ఏమిటంటే.. రిటైర్మెంట్ డబ్బులు చెల్లించలేని స్థితిలో… ఉద్యోగ సంఘాలు అడగని పదవీ విరమణ వయసును పెంచాను. అదొక్కటే అమలు చేశారు. ఇంకేమీ అమలు చేయకపోయినా ఉద్యోగ నేతలు మాత్రం. .. ప్రభుత్వాన్ని వెనకేసుకు వస్తూనే ఉన్నారు.
ఉద్యోగ సంఘాల డిమాండ్లు నిజానికి డిమాండ్లు కాదు. తమ డబ్బులు తమకు ఇవ్వమనే అడుగుతున్నారు. సమయానికి జీతాలివ్వాలని కోరుతున్నారు. ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చిన హమీలు.. గత చర్చల సంద్భంగా ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నారు. ప్రధానంగా పదేళ్ల సర్వీసు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్ , పెండింగ్ డీఏల చెల్లింపు, సీపీఎస్ రద్దు , గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు, పెండింగ్లో ఉన్న రెండు డీఏలు, సీపీఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన 1,600 కేసుల మాఫీ వంటి డిమాండ్లు ఉన్నాయి.
అసలు ఉద్యోగుల జీతంలో నుంచి కట్ చేసిన సొమ్మును ప్రభుత్వం వాడుకోవడం.. తిరిగి ఇవ్వడానికి వాయిదాలు పెడుతూండటం అదేదో సొంత సొమ్ము ఇస్తున్నట్లుగా చర్చలు జరపుతున్నా ఉద్యోగసంఘాలు చర్చలంటూ వెళ్తున్నాయి. నెలాఖరులోపు మూడు వేల కోట్లు చెల్లిస్తామని సజ్జల చెబుతున్నారు. కానీ ప్రభుత్వం ఇస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదు. ఎందుకంటే… ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, టీచర్లు ఓట్లు వేయాల్సి ఉంది. అవి అయిపోగానే పట్టించుకోరని నమ్ముతున్నారు. ప్రభుత్వం వద్ద జీతాలకే డబ్బుల్లేని పరిస్థితిలో తమకు ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తుందో కూడా చెప్పాలని అంటున్నారు.
సీఎం గా జగన్ వస్తే సీపీఎస్ రద్దు అవుతుందని.. ఊహించనంత ఫిట్ మెంట్తో పీఆర్సీ ఇస్తారని డీఏలు ఆపరని.. ఇలా రకరకాలుగా ఉద్యోగులు ఊహించుకున్నారు. కానీ వాస్తవంగా జరుగుతోంది వేరు. జీతాలే సరిగ్గా రావడం లేదు. ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తగ్గించారు. డీఎలు అన్నీ ఆపి ఒక్కసారి ఇచ్చి ఆ లోటును భర్తీ చేశారు. మొత్తంగా తాము మోసపోయామనుకుంటున్నారు. కానీ ఉద్యోగ నేతలు మాత్రం అవసరం వచ్చినప్పుడు … ప్రభుత్వమే సూచనలిచ్చినప్పుడు ఉద్యమం అంటున్నారు.