దేశంలో అత్యంత ధనవంతమైన రాష్ట్రాలు ఉన్నాయి. దేశం మొత్తం మీద 20 శాతానికన్నా ఎక్కువ ప్రజల్ని పోషిస్తున్న యూపీ లాంటి రాష్ట్రం ఉంది. ఆర్థికంగా బలమైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు , గుజరాత్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కాకుండా.. ఒక్క ఏపీకి మాత్రం ఇబ్బడిమబ్బడిగా అప్పులు ఇచ్చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. ఏ ప్రాతిపదిన ఇస్తున్నారో కూడా కేంద్రం చప్పండ లేదు. అప్పుల పేరుతో దేశ ప్రజల సొమ్ము ఏపీని నాశనం చేయడానికి వినియోగిస్తున్నారు.
లక్ష రూపాయల ఆదాయం వస్తే.. మరో లక్ష రూపాయల అప్పు ఎవరైనా చేస్తారా ? చేసే వాళ్లుంటారు ? కానీ ఇచ్చే వాళ్లుంటారా ? . ఏపీ సర్కార్ కు మాత్రం లక్ష రూపాయల ఆదాయం ఉంటే రెండు లక్షల అప్పు ఇచ్చేందుకు ఆర్బీఐ రెడీగా ఉంది. ఏడాది మొత్తం మీద 43వేల కోట్లు అప్పు చేస్తామని బడ్దెట్లో పెట్టి… నాలుగు నెలలకే మొత్తం చేసేసినా.. ప్రతీ వారం రెండు వేల కోట్లు అప్పు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఒక్క ఆర్బీఐ దగ్గర చేసే అప్పే లక్ష కోట్లు ఉంటుంది. కార్పొరేషన్ల అప్పులు మరో యాభై వేల కోట్లు అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇంతా చేసి ఏపీ సొంత ఆదాయం 90వేల కోట్లు ఉంటుంది. ఇందులో మద్యం వాటా పాతిక వేల కోట్లు.
ఇతర రాష్ట్రాలు ఆర్బీఐ దగ్గర అప్పులు తీసుకోవాలంటే ఎఫ్ఆర్బీఎం పరిమితులు అడ్డు వస్తాయి. ప్రోగ్రెసివ్ స్టేట్ అయిన కేరళకు ఏడాది మొత్తం ఆర్బీఐ ఇచ్చే అప్పు రూ. 17వేల కోట్లు మాత్రమే. కానీ ఏపీ ఒక్క నెలలో ఆ ఆప్పు చేస్తుంది. ఎప్పుడూ ఓడీలో ఉంటుంది. రేపు మంగళవారం మరోసారి రెండువేల కోట్లు అప్పు తెస్తున్నారు. అది ఓడీకి సరిపోతుంది. మళ్లీ ఓడీ తీసుకుంటారు. మళ్లీ మంగళవారం అప్పు తీసుకుని ఓడీని సర్దుబాటు చేస్తారు. ఓ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగిపోయేలా చేయడానికి ఇలా కేంద్రం సహకరించడం చరిత్రలో ఉండదు. ఇది ఏపీ ప్రజల చేసుకున్న దురదృష్టం కావొచ్చు.