హిందూ ఆలయాల్లో అన్యమతస్తులను ఏరివేయడానికి ఏపీ సర్కార్ కొత్త ప్రయత్నం చేస్తోంది. అలాంటి వారు… ఇతర మతాల ప్రార్థనలు చేస్తున్నట్లుగా వీడియోలు ఉండే పంపాలని కోరుతోంది. వెంటనే వీడియోల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెబుతోంది. ఆ వీడియోలను.. దేవాదాయశాఖకు పంపాలని ప్రభుత్వం చెబుతోంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత పరమైన విమర్శలు ఎక్కకవగా వస్తున్నాయి. మత మార్పిళ్లని.. ఆలయాల్లో అన్యమతస్తుల్ని చొప్పిస్తున్నారని.. వరుసగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఏపీ ప్రభుత్వం.. ఆలయాల్లో అన్యమతస్తులను ఏరి వేయడానికి సీరియస్గా ప్రయత్నం చేస్తోంది. ముందుగా.. హిందూ ఆలయాల్లో పని చేసే వారందరికీ దగ్గర సెల్ఫ్ డిక్లరేషన్లు తీసుకున్నారు.
అయితే.. ఇలాంటి డిక్లరేషన్లు తీసుకుంటే ఏం ప్రయోజనమని విమర్శలు వచ్చాయి. కానీ ప్రభుత్వం మాత్రం.. ఇంకేం చేయాలని తీవ్రంగా మేధోమథనం చేసింది. చాలా మంది హిందువులే. ఆలయాల్లోనే పని చేస్తున్నారు. ఆయా దేవుళ్లకు వచ్చే హుండీ సొమ్ము నుంచే జీతాలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వారు.. ఆయా దేవుళ్ల మీద నమ్మకం ఉంచకుండా.. మతం మారి.. ఇతర చోట్ల ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. ఈ జాడ్యం తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి… దాదాపు ప్రతీ ఆలయంలోనూ ఉంది. అందుకే తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం జరిగినా.. దాని వెనుక జగన్ ఉన్నారనే ప్రచారాన్ని రాజకీయ పార్టీలు చేసే అవకాశం ఉంది. అలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
ఆలయాల్లో పని చేస్తున్న అన్యమతస్తులు.. ఇతర మతాలను స్వీకరించి ఉంటే.. ఫిర్యాదు చేయాలని భక్తులకే సూచిస్తున్నారు. వారి వీడియోలు పంపితే.. స్పెషల్ టీంతో ఆకస్మిక తనిఖీలు చేయించి.. వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఇప్పటికే.. ఆలయాల్లో పని చేస్తున్న ఇతర మతస్తులందరికీ ప్రభుత్వం ఓ ఆఫర్ ఇచ్చారు. వారు ఇతర శాఖలకు వెళ్లిపోవాలని సూచించింది. లేకపోతే.. ఇక ఇళ్లల్లో సోదాలు చేసి… అన్యమత ఉద్యోగుల్ని టీటీడీ పట్టుకునే అవకాశం కనిపిస్తోంది.