ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ రాకేష్‌కుమార్ పై ఏపీ ప్రభుత్వం ఓ రకంగా యుద్ధం చేస్తోంది. ఆయన విచారించే పిటిషన్ల విషయంలో… ఆయన విచారించవద్దని పిటిషన్లు వేస్తోంది. విచారణ నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తోంది. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ ఆస్తులు నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నారని.. దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ రాకేష్ కుమార్ ధర్మానసం విచారణ జరుపుతోంది. అయితే ఆయన ధర్మాసనం నుంచి వైదొలగాలని ప్రభుత్వం పిటిషన్ వేసింది. దానికి కారణాలేమిటంటే… ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయని.. న్యాయమూర్తి వ్యాఖ్యానించాని… అందువల్ల ఆయన న్యాయం చేస్తారన్న నమ్మకం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు అఫిడవిట్లో పేర్కొన్నారు.
అయితే… ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయని తాను ఎక్కడ అన్నానని.. జస్టిస్ రాకేష్ కుమార్ విచారణ సందర్భంగా ప్రశ్నించారు. దానికి ప్రభుత్వం తరపు న్యాయవాది తడబడ్డారు. మీడియాలో వచ్చిందని చెప్పుకొచ్చారు. విచారణ జరుగుతున్న సమయంలోనే ఏబీఎన్‌లో వచ్చిందని… ఆ తర్వాత రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిందని.. ప్రభుత్వ న్యాయవాది చెప్పుకొచ్చారు. నిజానికి కోర్టు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే.. రికార్డుల్లో ఉండేవి. ఆ వ్యాఖ్యలు రికార్డుల్లో కూడా లేవు. న్యాయమూర్తి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా… అది విచారణలోనే అంటే.. ప్రభుత్వ న్యాయవాది సమక్షంలోనే. అయినప్పటికీ.. తమ ఎదుట అన్నారని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పకుండా.. మీడియాలో వచ్చిందని చెప్పడం ద్వారా.. కొత్త సంప్రదాయానికి తెర తీసినట్లయిందనే విమర్శ న్యాయవాద వర్గాల నుంచి వస్తున్నాయి.
మీడియాలో వచ్చిందనేసరికి న్యాయమూర్తి.. ఏ మీడియాలో వచ్చిందో.. ఆధారాలు సమర్పించాలని కోరారు. కానీ వాటికి సంబంధించిన క్లిప్పింగులు కానీ. పేపర్ కటింగ్‌లు కానీ… సమర్పించలేకపోయారు. నిజానికి జస్టిస్ రాకేష్ కుమార్… ఏపీలో రాజ్యాంగ విచ్చిన్నం జరిగిందో లేదో విచారణ జరుపుతారమని హేబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ సందర్భంగా అన్నారు కానీ.. రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఎప్పుడూ అనలేదు. మీడియా రిపోర్టింగ్ చేయలేదు. కానీ జస్టిస్ రాకేష్ ను టార్గెట్ చేయడానికి ఏబీఎన్, ఆంధ్రజ్యోతి భుజం మీద నుంచి ఏపీ సర్కార్ గురి పెట్టడానికి ప్రయత్నించిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ అంశంపై ఏబీఎన్, ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఎలా స్పందిస్తుందో.. వేచి చూడాలి.. !