ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెందిన విలువైన భూములను బిల్డ్ ఏపీ పథకంలో భాగంగా అమ్మేయాలనుకుంటున్నారు. అలాగే.. ఏప్రిల్‌లో.. పేదలందరికీ ఇళ్ల స్థలాలివ్వాలనుకుంటున్నారు. మరి దానికి భూములు ఎక్కడి నుంచి వస్తాయి..?. అందుకే.. ఆయన భూసమీకరణ చేయాలని.. ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడెక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అవకాశం ఉందో.. అక్కడ భూసమీకరణకు .. చేయాలని.. ఇరవై ఒకటో తేదీన జీవో జారీ చేశారు. ఈ భూసమీకరణ విధివిధానాలు.. గురించి.. ప్రత్యేకంగా చెప్పకుండా..” సీఆర్డీఏ” చేసినట్లుగా భూసమీకరణ చేయాలని చెప్పుకొచ్చేశారు. ఈ జీవో చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే.. భూసమీకరణను.. అందరూ ప్రశంసిస్తున్నా.. వ్యతిరేకించింది.. జగన్మోహన్ రెడ్డినే మరి.
అమరావతి భూసమీకరణపై.. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. ఏదైనా ఓ ప్రాజెక్టు కోసం.. వంద ఎకరాలు ఇప్పుడు.. సేకరించాలంటే.. రణరంగమయ్యే పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాల కోసం.. రెచ్చగొట్టే వాళ్లు ఒక వైపు ఉంటే.. ప్రభుత్వంపై నమ్మకం లేక భూయజమానాలు.. తమ ఆస్తులను ఇవ్వడానికి సిద్ధపడేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో రాజదాని అమరావతి కోసం.. చంద్రబాబునాయుడు.. భూసమీకరణ అనే కొత్త విధానాన్ని ప్రకటించారు. ఎంత మంది భూములు ఇస్తారో అన్న సందేహం.. మొదట్లో ఉంది. అయితే.. దాదాపుగా 29 గ్రామాల్లోని రైతులందరూ.. 98 శాతం.. భూములు ఇచ్చారు. ఇది ఓ రోల్ మోడల్‌గా మారిందన్న అభిప్రాయాన్ని ప్రపంచ స్థాయి ఆర్థిక వేత్తలు వెల్లడించారు.
అయితే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. జగన్మోహన్ రెడ్డి ఈ విధానాన్ని తప్పు పట్టారు. రైతుల నుంచి బెదిరించి భూములు తీసుకున్నారని ఆరోపణలు గుప్పించారు. పలు సందర్భాల్లో భూములు రైతులకు ఇచ్చేస్తామని కూడా చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలు మర్చిపోయారు. ఇప్పుడు.. ఈ భూసమీకరణ విధానం ఆయనకు చాలా బాగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. అందుకే.. పేదల ఇళ్ల కోసం.. ప్రజల భూముల్ని తీసుకోవడానికి ఈ భూసమీకరణ విధానానికే ఓటేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. వ్యతిరేకించిన ప్రతీ విధానాన్నీ .. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తూ. చ తప్పకుండా.. మొహమాటం లేకుండా అమలు చేస్తున్నారు.