ప్రస్తుత సంక్షోభ సమయంలో… ప్రజలతో పాటు ప్రభుత్వ ఆదాయం కూడా పడిపోయింది. ప్రజలకు ఆదాయం రావాలంటే.. పనులు చేసుకోవాలి. ఆ పనులు దొరకడం గగనంగా మారింది. ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే ప్రజల వద్ద పన్నులు వసూలు చేసుకోవాలి. ప్రజలకు ఆదాయం ఉన్నా లేకపోయినా.. పన్నులు పెంచి మరీ వసూలు చేసుకుంటే.. తగ్గిపోయిన ఆదాన్ని కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏపీ సర్కార్ అదే చేస్తోంది. తగ్గిన ఆదాయాన్ని పన్నులు పెంచి కవర్ చేసుకోవాలనుకుంటోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌పై.. దేశంలోనే అత్యధిక రేటుకు తీసుకొచ్చిన జగన్ సర్కార్.. తాజాగా భూముల ధరల్ని మెట్రో సిటీల రేంజ్‌కు తీసుకెళ్లేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసింది. భూములు మాత్రమే కాదు.. భవనాల విలువను కూడా పెంచబోతోంది.
భూములు, ఆస్తుల విలును ప్రభుత్వం పెంచితే… దానికి తగ్గట్లుగా రిజిస్ట్రేషన్ ఫీజు భారం… కొనుగోలుదారులపై పడుతుంది. బహిరంగ మార్కెట్లో ధరలు ఎంత ఉన్నా… మార్కెట్ రేటు ప్రకారమే.. రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తారు. ప్రభుత్వ.. ఈ మార్కెట్ల రేట్లను పరిస్థితిని బట్టి మారుస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ భూమ్లో ఉన్నప్పుడు.. భూములు, ఆస్తుల విలువ పెరుగతుంది. తగ్గినప్పుడు తగ్గుతాయి. అలాంటి పరిస్థితులు లేకుండా.., ప్రభుత్వం ఓ మార్కెట్ రేటు డిసైడ్ చేసి.. దాని ప్రకారం.. రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేస్తుంది. ఇప్పుడు.. ఆ మార్కెట్ రేటును… భారీగా పెంచడం ద్వారా.. రిజిస్ట్రేషన్ ఆదాయాన్న గణనీయంగా పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ క్షణమైనా ఉత్తర్వులు రావొచ్చని.. ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏ రంగం పరిస్థితి బాగోలేదు. అన్ని లాక్ డౌన్ కారణంగా షట్ డౌన్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పరిస్థితి కూడా అంతే ఉంది. అమ్మకాలు.. కొనుగోళ్లు నిలిచిపోయాయి. భూముల విలువ పడిపోయింది. యాభై లక్షలు ఖర్చు పెట్టి కట్టిన ఇళ్లను అదే ధరకు కొనుగోలు చేసే వారు కూడా లేరు. మరో ఏడాది వరకు పరిస్థితి మెరుగుపడదని.. ప్రభుత్వమే.. వివిధ రకాల పన్ను రాయితీలు కల్పించాలని బిల్డర్లు.. నిర్మాణ రంగానికి చెందిన వారు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం.. తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు వారిపైనే మరింత భారం వేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
ఇప్పటికే… ఏపీ ప్రభుత్వం.. పెద్ద ఎత్తున అప్పులు చేస్తోంది. అయినా.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు.. వాలంటీర్లు.. సచివాలయ ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు.. పెన్షన్లకు.. సరిపోవడం లేదు. ప్రతీ నెలా.. ఆదాయానికి రెండింతల మేర లోటు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఉంటే.. త్వరలో దివాలా ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం … ఆదాయమార్గాల పెంపుపై దృష్టి పెట్టి.. అన్ని రకాల పన్నులను పెంచుకుంటూ పోతోంది.