పేదల సీఎం గా తనను తాను చెప్పుకునే జగన్ రెడ్డి పెద్ల దగ్గర వసూలు చేసిన పన్నులతో కట్టిన ప్యాలెస్ చూసి రాష్ట్ర ప్రజల మైండ్ బ్లాంక్ అవుతోంది. వందల కోట్లు ఖర్చు చేసి… అతి నిక్షేపంగా ఉన్న టూరిజం రిసార్ట్స్ ను కూలగొట్టేసి , పర్యావరణ నిబంధనలన్నింటినీ అతిక్రమించిన కట్టిన ప్యాలెస్ వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. ఇంత కాలం చిన్న ఫోటో కూడా బయటకు రానివ్వలేదు. కానీ ఇప్పుడు గంటా శ్రీనివాసరావు అందర్నీ ప్యాలెస్‌లోకి తీసుకెళ్లి చూపించారు.
ఒక్కో కమోడ్ పాతిక లక్షల రూపాయలు… బాత్ టబ్ రేటు అంత కంటే ఎక్కువ. బాత్ రూమ్ ఫిట్టింగ్ ఏదీ లక్షకు తక్కువ లేదు. మాస్టర్ బెడ్ రూం బాత్ రూం పేదలకు కట్టించిన సెంట్ స్థలం కన్నా .. రెండింతలు ఉంటుంది. రెండు సెంట్లలో బాత్ రూం ఉంటుంది. అందులో ఉన్న లగ్జరీయిస్ వస్తువులకు ఓ వందో.. రెండు వందలో సెంట్ స్థలాల ఇళ్లు కట్టేయవచ్చు. ఆ ఇల్లు చూస్తే జగన్ రెడ్డి తనదే అధికారం అని.. అక్కడ్నుంచే ఇక పరిపాలన చేయాలనుకున్నారని సులువుగా అర్థమైపోతుంది.
ఈ రుషికొండ ప్యాలెస్ వీడియోలు, ఫోటోలు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ప్రజాధనాన్ని ఇంత ఘోరంగా ఖర్చు పెట్టే సీఎం ఉంటారా.. తన లగ్జరీల కోసం ఇలా చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. సద్దాంహుస్సేన్.. వంటి నియంతలు కట్టుకున్న ప్యాలెస్‌లను తలదన్నేలా ఉంది.
ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి రావడంతో వైసీపీ కవర్ డ్రైవ్ చేసింది. ఇది విశాఖకుఎవరైనా ప్రముఖులు వస్తే బస చేసేందుకు కట్టిందని కవర్ చేసుకుంది. కానీ నిజమేంటో ప్రజలకు తెలుసు. తాను చిన్న ఇల్లు కట్టుకుంటే రాద్దాంతం చేస్తున్నారని జగన్ కూడా గతంలో వ్యాఖ్యానించారు. ఎవర్నో పిచ్చి వాళ్లను చేయాలనుకుంటున్నారు. జగన్ రెడ్డి మరోసారి ప్రజలకు అడ్డంగా దొరకిపోయారు.