పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య ఉన్న నెలన్నర రోజుల తేడా కారణంగా… ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాలు… రెండు భాగాలుగా విడిపోయే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులను రెచ్చగొట్టేందుకు… సాక్షాత్తూ ఓ అత్యున్నత అధికారే ప్రయత్నిస్తున్న వ్యవహారం ఇప్పుడు.. ఏపీ సచివాలయంలో కలకలం రేపుతోంది. ఓ పార్టీ మళ్లీ గెలుస్తుందని.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే.. తానే .. అత్యున్నత పదవిలోఉంటారని.. తనను నమ్ముకున్న వారికి… కీలకమైన పోస్టులు దక్కుతాయనే భావన కల్పిస్తూ.. ఓ ఉన్నతాధికారి.. ఐఏఎస్‌లలో కొంత మందిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఎం తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వాటిని ఖండించాలని.. ఆయన జూనియర్ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు.
ఎందుకొచ్చిన గొడవ అనుకున్న కొంత మంది … ఐఏఎస్ అధికారులు.. ఈ మేరకు.. ఓ సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశం అని పేరు పెట్టి… అందరూ ఐఏఎస్ అధికారులకూ సమచారం పంపారు. అయితే.. అత్యున్నత అధికారి ఇంటెన్షన్, ఆయన వ్యవహారాలపై… చాలా మంది తోటి అధికారుల్లో సందేహాలు ఉన్నాయి. ఆ సమావేశం పేరుతో.. అభ్యంతరకర తీర్మానాలు చేస్తే.. సర్వీస్ రూల్స్ ను అతిక్రమించినట్లవుతుందన్న భయంతో… ఎవరూ వెళ్లలేదు. 180కిపైగా ఉన్న ఐఏఎస్ అధికారుల సంఘంలో.., కేవలం పది మంది మాత్రమే హాజరయ్యారు. దాంతో సమావేశానికి ప్రాధాన్యం లేకుండా పోయింది.
అంతకు ముందు.. ఐఏఎస్ అధికారంలదరూ కలిసి… ఉన్నతాధికారిపై.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తారంటూ.. మీడియాకు సమాచారం ఇచ్చారు. కీలకమైన అధికారులు అందరూ వస్తారని… చెప్పుకొచ్చారు. దాంతో.. ప్రభుత్వంపై ఐఏఎస్ అధికారుల తిరుగుబాటు అన్న ఫీలింగ్ వస్తుందని అనుకున్నారు. కానీ.. ఏ ఒక్కరూ.. ఆ అత్యున్నత అధికారిని నమ్మే సాహసం చేయలేకపోయారు. రాజకీయ ఎజెండాతో.. అధికారవర్గాల్లోనూ ఆయన విభజన చేస్తున్నారన్న అభిప్రాయంతో మెజార్టీ ఐఏఎస్‌లు ఉన్నారు. మరో నెల రోజుల పాటు.. తమకు ఈ కష్టాలు తప్పవని… ఐఏఎస్‌లు ఆందోళన చెందుతున్నారు.