సెప్టెంబర్లోనే ఏపీ ప్రభుత్వం ఎగుమతుల ఫెస్టివల్ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్లిపోయిందని కొంత మందికి అవార్డులు కూడా ఇచ్చారు. తీరా ఇప్పుడు ర్యాంకులు వచ్చాయి. అసలు చూస్తే ఏపీ ర్యాంక్ పడిపోయింది. కేంద్ర వాణిజ్యశాఖ సోమవారం విడుదల చేసిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో నిలిచింది. 2019లో 3వ ర్యాంకులో నిలిచిన రాష్ట్రం ఆరు స్థానాలు కోల్పోయింది. రాష్ట్రం స్కోర్ 3.42 నుంచి 3.17కి పడిపోయింది. అంటే టీడీపీ హయాంలో మూడో స్థానంలో ఉంటే వైసీపీ హయాంలో తొమ్మిదో స్థానానికి పడిపోయిందన్మాట.
ఏపీ కంటే ఒడిషా, యూపీ మెరుగ్గా ఉన్నాయి. మంచి మౌలిక వసతులు కల్పించడం.. ఎగుమతి దారులతో సంప్రదిపంులుజరపడం వంటి విషయాల్లో ఏపీ సర్కార్ విఫలమయిందని నివేదిక తేల్చింది. కొన్నాళ్లుగా ఏపీ ప్రభుత్వం అభివృద్ధి పనులపై ఖర్చును ఆపేయడంతో ఆ అది మౌలిక సదుపాయాలపై ప్రభఆవం చూపుతోంది. ప్రధానంగా రోడ్డు దెబ్బతిన్నాయి. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే రోడ్, విశాఖలో పోర్టును చేరుకునే రోడ్లు అన్నీ పాడైపోయాయి. అనేక చోట్ల గౌడోన్ల కొరత ఉంది. పెట్రోల్, డీజిల్ పన్నులు కూడా ఎక్కువే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల కారణంగా ఏపీలో అన్ని రంగాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా ఆక్షేపించి అంత కంటే మంచి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం .. తీరా అధికారంలోకి వచ్చాక ఆ నిర్ణయాలకు మరింత పన్నులు వడ్డించే ప్రయత్నాలు చేస్తోంది . ఈ కారణంగా ఏపీలో అన్ని రంగాల ర్యాంకులు తగ్గిపోతున్నాయి.