పుంగనూరులో రాజకీయ గొడవలు జరిగాయి. అక్కడ ఎస్పీ రిషాంత్ రెడ్డి. దీనిపై ప్రెస్ మీట్ పెట్టిన రిషాంత్ రెడ్డిని వెనకేసుకు వచ్చిన డీఐజీ అమ్మిరెడ్డి. వీరందరికీ పోలీస్ బాస్ రాజేంద్రనాథ్ రెడ్డి. ఇక ప్రభుత్వాధినేత జగన్ రెడ్డి. ఇది ఒక లేయరు. ఇటు సిక్కోలు నుంచి అటు చిత్తూరు వరకూ.. ఎక్కడ ప్రభుత్వ విధాల గురించి , పథకాల గురించి లేదా ఏదైనా ఘటన జరిగినప్పుడు తెర ముందుకు వచ్చే అధికారులు ప్రతి ఒక్కరూ రెడ్లే. కావాలంటే ఏపీ నుంచి వార్తలను ఓ రోజు పాటు చూస్తే … రాష్ట్రంలో ప్రతీ వ్యవస్థనూ రెడ్లే నడుపుతున్నారా.. ఇంకెవరూ లేరా అన్న డౌట్ సహజంగానే అందరికీ వస్తుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసి మరీ సొంత వర్గానికి పదవులు
ఏపీలో ప్రతి ఒక్క వ్యవస్థలో రెడ్డి సామాజికవర్గ అధికారులే పెత్తనం చేస్తున్నారు. రెడ్డి అనే వారు అటెండర్ గా చేరిన చాలు వారికి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చి పై స్తాయిదాకా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటున్నారు. ఇదు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారుల అవకాశాలను కూడా కూలదోస్తున్నారు. ప్రత్యేక జీవోలిస్తున్నారు. రాష్ట్రంలో డీఎస్పీల్లో అత్యధికులు రెడ్డి సామాజికవర్గం వారే. వారు కాకపోతే కన్వర్టడ్ క్రిస్టియన్స్ ఉంటారు. తప్పనిసరిగా బలహీనవర్గాల అధికారులకు పోస్టింగ్ ఇవ్వాల్సి వస్తే.., వారిపైన రెడ్డి అధికారిని పెట్టి మొత్తం.. పవర్స్ లాగేసుకుంటారు.
టీటీడీ చైర్మన్ లాంటి వాటిలోనూ సొంత వారికే ప్రాధాన్యం !
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి. అది ప్రభుత్వవిధి. అలా చేయకపోతే .. ప్రజలకు అన్యాయం చేసినట్లే. ఏపీసర్కార్ అదే చేస్తోంది. టీటీడీ అనే మహోన్నతమైన సంస్థకు.. కుల, మతాలు చూసుకుని చైర్మన్లను నియమిస్తున్నారు. కురణాకర్ రెడ్డికి దేవుడిపై నమ్మకం లేదనేది బహిరంగ రహస్యం. ఆయన క్రిస్టియానిటీని కూడా పాటిస్తారు. అలాంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ పోస్టు ఇవ్వడం హిందువుల్ని అవమానించడమే. కానీ ఇచ్చారు. బీసీలకు ఇస్తామని ప్రచారం చేసి.. చివరికి వారికి మొండి చేయి చూపి భూమనకు ఖరారు చేశారు.
కుర్చీల్లేని నామినేటెడ్ పోస్టులు బలహీనవర్గాలకు .. ఆదాయం ఉండేవి రెడ్లకు !
ఏపీలో నామినేటెడ్ పోస్టుల్లో అత్యధికం.. రెడ్లకే దక్కాయి. విధులు, నిధులు , అధికారం ఉండే ప్రతి పోస్టులోనూ రెడ్లే ఉన్నారు. కుర్చీలు..ఆఫీసులు లేని కార్పొరేషన్లు..ఇతర పదవులు మాత్రం బలహీనవర్గాలకు ఇచ్చారు. పెత్తందారీ వ్యవహారంతో రెడ్ల గుప్పిట్లోకి ప్రజల్ని పంపేస్తున్నారు. ఓ వ్యక్తి ఆర్థికమూలాలన్ని దెబ్బతీసి.. ఆస్తులు, మానాలను లాక్కుని ప్రాణం కావాలంటే కుక్కిన పేనులా పడి ఉండాలన్న పరిస్థితిని ప్రజలకు తెచ్చేందుకు రెడ్డి పెత్తందారులు అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు చివరి స్టేజికి వచ్చింది. ఇతర వర్గాలు తెలుసుకోకపోతే..ఇక వాళ్ల ఆస్తులు.. మన ప్రాణాలకు ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. ఎదుకంటే వ్యవస్తలేమీ కాపాడలేని విధంగా ఇప్పటికే పాలకులకు చాన్సిచ్చారు మరి.