ఏపీ ప్రభుత్వాన్ని నమ్మి పనులు చేసిన కాంట్రాక్ట్రర్లకు బిల్లులు పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉన్నాయి. వేచి చూసి చూసి చాలా మంది కోర్టులకు వెళ్తున్నారు. కోర్టుల్లో ప్రభుత్వం మోసం చేసిందని… బిల్లులు చెల్లించాలని దాఖలవుతున్న పిటిషన్లు ప్రతీ రోజూ వేలల్లో ఉంటున్నాయి. చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పినా.. చెల్లించడం లేదు. దాంతో కోర్టు ధిక్కార పిటిషన్లు కూడా వేలల్లోనే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితిని మార్చుకోవడానికి ప్రభుత్వం కొత్తగా ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని ప్రయత్నిస్తోంది. హైకోర్టులో ఇలాంటి బిల్లులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి మాజీ న్యాయమూర్తులతో ఆర్బిట్రేషన్ పెట్టుకోవాలని చూస్తోంది.
అలా చేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చే చాన్సులు ఎక్కువ. ఎక్కడైనా బిల్లులు చెల్లించాలి కానీ.. చెల్లించకుండా ఎగ్గొట్టే ప్రణాళికలు వేసుకోవడం ఏపీ సర్కార్ మాత్రమే చేస్తుంది. ఇలా చేయడం అంటే ప్రభుత్వంపై నమ్మకాన్ని పూర్తి స్థాయిలో చిదిమేయడమేనని.. దివాలా తీసినట్లుగా పరోక్షంగా అంగీకరించడమేనన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు… ఖచ్చితంగా డబ్బులు వస్తాయనే పనులు చేస్తారు. తీరా పనులు చేసిన తర్వాత ఏదో ఓ వంకతో ఆపేసి.. చివరికి వేధింపులకు పాల్పడటం అంటే.. అంత కంటే నీచమైన పని ఉండదు. ఏపీ ప్రభుత్వం అదే చేస్తోంది.
ఈ బిల్లులు..కేవలం టీడీపీ హయాంలోనివే కాదు. గత నాలుగేళ్లుగా వైసీపీ హయాంలో చేసినవి కూడా. చివరికి.. మాస్కులు కుట్టాలని మహిళలకు ఇచ్చిన పనుల బిల్లులుకూడా చెల్లించడం లేదని వారుసోషల్ మీడియాలో నెత్తి నోరూ బాదుకుంటున్నారు. కరోనాపేషంట్లకు భోజనాలు సరఫరా చేసి.. మొత్తంగా ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడిన వారుఉన్నారు. ఇలాంటి వారందర్నీ మోసం చేసి.. బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం సాధించడమే కాకుండా.. ఇప్పుడు ఎగ్గొట్టడానికి ప్రణాళికలు వేస్తోంది. ప్రభుత్వ ఖాజానానే కాదు.. ప్రభుత్వ పెద్దల ఆలోచనల దివాలా అని కూడా దీన్ని అనొచ్చు.