ఏపీ ప్రభుత్వం సంక్రాంతి తర్వాత రూ. పదివేల కోట్ల అప్పులు చేసింది. రూ. ఐదు వేల కోట్లను పోర్టులు కడతామని చెప్పి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి వడ్డీ… సాధారణ జనం తీసుకునే పర్సనల్ లోన్ అంత ఉంది. అంటే దాదాపుగా పన్నెండు శాతం వరకూ ఉంటుంది. దాంతో పాటు ఆర్బీఐ దగ్గర వేస్ అండ్ మీన్స్.. ఇతర పద్దతుల్లో ఐదు వేల కోట్లు తెచ్చారని చెబుతున్నారు ఇప్పుడు అవన్నీ ఉన్నాయి…. ఆత్మహత్యలు చేసుకుంటున్న చిన్న చిన్న కాంట్రాక్టర్లకు. .. బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి.. కోర్టుకెక్కిన వారికి ఇస్తారేమో అని ఆశపడతారేమో కానీ.. అవన్నీ అయిపోయాయి కూడా.
రూ. పదివేల కోట్లను అప్పు తెచ్చి బిల్లులను రాష్ట్ర ప్ఱభుత్వం చెల్లించిందని.. అయితే ఈ బిల్లులన్నీ.. చిన్న కాంట్రాక్టర్లకు కాదు.. బడా కాంట్రాక్టర్లకు చెల్లించారంటున్నారు. అసలు రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులేమీ నిర్మాణంలో లేవు. అన్నీ ఆగిపోయాయి. ఏం కట్టారని బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారో తెలియదు. ఇలాంటివన్నీ ప్రభుత్వం సీక్రెట్ గానే ఉంచుతోంది. పారదర్శకత అనేది లేనే లేదు. మాటల్లో మాత్రం ప్రపంచంలో అమెరికా అయినా సీక్రెట్లుదాచిపెడుతుందేమో కానీ ఏపీ మాత్రం పారదర్శకలో కింగ్ అని చెబుతూ ఉంటారు.
ఆర్బీఐ దగ్గర ఇంకో వెయ్యికోట్లు అప్పు తీసుకున్నారు. ఇక ఆర్బీఐదగ్గర పరిమితి లేదు. ఓడీ ఇంకా రెండున్నర వేల కోట్ల వరకూ ఉంది. వాటిని తీరిస్తే వచ్చే నెల జీతాలు, పెన్షన్లకు డబ్బులు సమకూర్చుకోవచ్చు. కానీ అలాంటి పరిస్థితి ఉందా అన్నదే డౌట్. ఏపీ ఆర్థిక నిర్వహణ.. అప్పుల తీరుపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ఏపీ ప్రజల భవిష్యత్ ను అంధకారం చేస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది.