ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు ఓ ఉత్సాహం కనిపిస్తోంది. తమ ఆస్తుల విలువలు పెరిగాయని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అమ్ముకోవాలనుకుంటున్న వారికి మంచి ధరలు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి కుప్పం వరకూ అన్ని చోట్లా ఈ హడావుడి కనిపిస్తోంది. అమరావతి, విశాఖలో మరింత ఎక్కువగా ఉంది. ఇంత కాలం టీడీపీ వస్తే… తమ ఆస్తి అమ్ముకుని కష్టాలు తీర్చుకుందామని ఎదురు చూస్తూ ఉన్న వారి సంఖ్యప్రతీ చోటా కనిపించేది. జగన్ హయాంలో విలువల్లేకపోవడంతో అమ్ముకోలేకపోయేవారు.
జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో రిజిస్ట్రేషన్ ఆదాయం పెద్దగా పెరగలేదు. దీనికి కారణం తప్పనిసరిగా చేసే లావాదేవీలు తప్ప.. ప్రజలు పెట్టుబడుల లెక్కన ఏపీలో ఆస్తులు కొనడానికి ఆసక్తి చూపించలేదు. ఫలితంగా అమ్మకాలు పడిపోయాయి. ఆస్తుల రేట్లు కూడా తగ్గిపోయాయి. ఐదేళ్ల కిందట ఓ గజం లేదా ఎకరం రేటు ఎంత ఉందో… చాలా చోట్ల అంత కన్నా తక్కువకే అమ్ముకున్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి మారిపోయింది. రెట్టింపు ధరలకు అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. డిమాండ్ పెరగడం, చాలా మంది ఇప్పుడు ఆస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూండటంతో లావాదేవీలు పెరుగుతున్నాయి.
విశాఖ కబ్జాదారుల గుప్పిట నుంచి బ యటపడినట్లేనని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రామ్మోహన్ నాయుడు విమానయానశాఖ కేంద్ర మంత్రి కావడంతో రెండేళ్లలో భోగాపురం పూర్తవుతుందని.. ఐటీ హబ్ గా లోకేష్ మారుస్తారన్న నమ్మకంతో భూముల విలువలు పెరిగాయి. అమరావతి రాజధానిలోనూ విలువలు పెరిగాయి. ఎక్కువగా హైప్ మీడియాలో అమరావతికి ఇస్తున్నారు. కానీ అన్ని చోట్లా పెరిగాయి. మొత్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఆంధ్రప్రదేశ్ విలువపెరిగిపోయిందని అనుకోవచ్చు.