ఏపీలో లిక్కర్ ఆదాయం గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే నాలుగు వేల కోట్లకుపైగా పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వం మద్యం పాలసీ మార్చిన తర్వాత పెరిగిన ఆదాయం ఇది. రేట్లు సగానికి తగ్గించి..రూ.99కే క్వార్టర్ ఇస్తున్న ఈ పాలసీలో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం పెరిగిందంటే చిన్న విషయం కాదు.
గతంలో రేట్లు రెట్టింపు ఉండేవి. కానీ ఆదాయం మాత్రం తక్కువ ఉండేది. అప్పట్లో రేట్లు ఎక్కువ ఉన్నాయని మందు బాబులు తాగడం మానేయలేదు. ఇళ్లు, ఒళ్లు తాకట్టు పెట్టుకుని మరీ తాగారు. మద్యానికి బానిస అయిన వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో సామాన్య, మధ్య తరగతి వాళ్లకు తెలుసు. మరి అప్పట్లో ఆ డబ్బంతా ఎటు పోయింది ?.
మద్యం పేరుతో ప్రజల్ని నాటి వైసీపీ ప్రభుత్వం, నాయకుడు లూటీ చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టారు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. పెరుగుతున్న ఆదాయం.. గతంలో దోచేసిన దానికి సాక్ష్యంగా కనిపిస్తోంది.