ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాజకీయమే ప్రధాన అడ్డంకి. ఈ విషయం మరోసారి నిరూపితమయింది. అభివృద్ధి కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకుంటే.. ఏపీ పరుగులు పెడుతుందని మరోసారి నిరూపితమయింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రెండవ అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును సాధించింది. మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. తమిళనాడు తర్వాత మన రాష్ట్రమే ముందు ఉంది.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్రాల వృద్ధి రేటు గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ 8.21% వృద్ధి రేటుతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు 9.18% వృద్ధి రేటుతో మొదటి స్థానంలో ఉంది. కేంద్రం ఈ గణాంకాలను ఆషామాషీగా విడుదల చేయదు. జీఎస్డీపీ డేటాను తీసుకుని అంచనా వేస్తుంది. ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవల మొత్తం విలువ జీఎస్డీపీ. చాలా కీలక రంగాల్లో గత ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోకుండా.. కనీసం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా ఆపేసింది.
ఈ ప్రభుత్వం రాగానే అలాంటి సమస్యలను ముందు పరిష్కరించింది. అలాగే పెట్టుబడులు పెరగడం, ఈజ్ ఆఫ్ డూయింగ్, పారిశ్రామిక విధానాల్లో సంస్కరణలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు నిర్ణయాలు ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ స్పీడ్ కొనసాగితే రానున్న రోజుల్లో ఏపీ తమిళనాడును కూడా మించిపోతుంది. 2014-19 మధ్య కూడా ఏపీ అభివృద్ధిలో పరుగులు తీసింది. కానీ వైసీపీ వచ్చాక పూర్తిగా నిర్వీర్యమయింది.