ఎన్టీఆర్ జాతీయ అవార్డుకి మోక్షం వచ్చింది. 2012 నుంచీ.. ఎన్టీఆర్ అవార్డు ఎవ్వరికీ ఇవ్వలేదు. అసలు అందుకు సంబంధించిన ప్రకటనా వెలువడలేదు. ఇప్పుడు ఒకేసారి 2012, 2013 సంవత్సరాలకు గానూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ అవార్డుల్ని ప్రకటించింది. అంతేకాదు.. బిఎన్ రెడ్డి జాతీయ అవార్డు, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులకూ మోక్షం వచ్చింది. 2014. 15, 16 అవార్డులనుకూడా త్వరలోనే ప్రకటిస్తారట. ఈ ఐదేళ్ల అవార్డులనూ ఒకేసారి, నంది అవార్డుల వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందిస్తారు.
అవార్డు గ్రహీతల వివరాలు:
2012 ఎన్టీఆర్ అవార్డు: ఎస్.పి.బాలసుబ్రమణ్యం
2013 ఎన్టీఆర్ అవార్డు: హేమామాలినీ
2012 బిఎన్ రెడ్డి అవార్డు: సింగీతం శ్రీనివాసరావు
2013 బిఎన్ రెడ్డి అవార్డు: కోదండరామిరెడ్డి
2012 నాగిరెడ్డి చక్రపాణి అవార్డు: డి.సురేష్ బాబు
2013 నాగిరెడ్డి చక్రపాణి అవార్డు: దిల్రాజు
2012 రఘుపతి వెంకయ్య అవార్డు: కోడిరామకృష్ణ
2013 రఘపతి వెంకయ్య అవార్డు: వాణిశ్రీ