పంచాయతీ అవార్డుల్లో తెలుగుదేశం హయాంలో దేశంలోనే ఎక్కువ అవార్డులు దక్కించుకునేది ఆంధ్రప్రదేశ్. అయితే ఈ సారి ఒక్కటంటే ఒక్క అవార్డూ దక్కలేదు. జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ అత్యధిక అవార్డులను గెలుచుకుంది. మొత్తం 27 అవార్డుల్లో 8 పురస్కారాలను తెలంగాణ పల్లెలు కైవసం చేసుకున్నాయి. కానీ ఏపీకి ఒక్కటీ దక్కలేదు. ఒడిషా ముడు, చత్తీస్ ఘడ్ కూడా రెండు అవార్డులు దక్కించుకున్నాయి. కానీ ఏపీకి మాత్రం ఒక్క దాంట్లోనూ అవార్డు రాలేదు.
ఆరోగ్య పంచాయతీ , తగినంత నీరు కలిగిన పంచాయతీ , సామాజిక భద్రతా, మహిళా స్నేహ పూర్వకం, పేదరికం లేని, మెరుగైన జీవనోపాధి, పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్, పచ్చదనం, పరిశుభ్రత , స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల విభాగాల్లో తెలంగాణ పల్లెలలకు అవార్డులు వచ్చాయి. మొత్తం అవార్డులు ఇస్తున్న 27 విభాగాల్లో ఏ ఒక్క దాంట్లోనూ ఏపీకి అవార్డు రాలేదు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామాలను పూర్తిగా గాలికి వదిలేసింది. పంచాయతీ నిధులు పూర్తిగా స్వాహా చేస్తోంది. దీంతో గ్రామాల్లో పనులు చేపట్టడానికి పైసా ఉండటం లేదు.
అదే సమయంలో పంచాయతీల అధికారాలు కత్తిరించేసి గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టారు. దీంతో వ్యవస్థ మొత్తం గందరగోళంగా మారింది. గ్రామాల్లో పాలన పడకేసింది. ఏ ఒక్క గ్రామంలోనూ చెప్పుకోదగ్గ పనులు జరగడం లేదు. గ్రామస్వరాజ్యాన్ని తెస్తున్నామని చెప్పి మొత్తానికి గ్రామాల్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిపోయారు. బ్యాడ్ గవర్నెన్స్ ఫలితాలు ఇలా రికార్డుల పరంగా బయటపడుతున్నాయి.