ప్రతి ఏడాది జనవరి వచ్చిందంటే ప్రపంచ పెట్టుబడుల సదస్సు హైలెట్ అవుతుంది. ప్రపంచంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలందరూ ఈ సదస్సుకు వస్తారు. ప్రభుత్వాలు, దేశాలు, రాష్ట్రాలు అన్నీ తమ తమ ప్రాంతాల్లో ఉన్న ప్లస్ పాయింట్లను డిస్ ప్లే చేసుకుని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాయి. గతంలో చంద్రబాబు ప్రతీ ఏడాది ఏపీ పెవిలియన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఏపీని ప్రమోట్ చేసేవారు. అక్కడ వచ్చిన ప్రతిపాదనల కారణంగా తిరుపతి ఎలక్ట్రానిక్ క్లస్టర్ లో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి.
పెట్టుబడుల సదస్సుకు చంద్రబాబు దావోస్ వెళ్లడం ఆయన సీఎంగా ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ప్రపంచపెట్టుబడి దారుల్లో ఏపీ ఇమేజ్ పెంచేందుకు ఆయన వినూత్న ప్రయత్నాలు చేస్తారు. వైసీపీ ఐదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క సారి జగన్ వెళ్లారు. అది కూడా వెకేషన్ కోసం వెళ్లారు. మధ్యలో మూడు రోజులు.. టూ లెంగ్తీ క్వశ్చన్స్ ను ఫేస్ చేసి చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత మరోసారి అటు వైపు వెళ్లలేదు.
ఈ సారి చంద్రబాబునాయుడు ప్రత్యేక బృందంతో వెళ్తున్నారు. ప్రతి ఏడాది జనవరిలో ఈ సదస్సు జరుగుతుంది.. పదేళ్ల పాటు పెట్టుబడిదారుల్లో పోయిన ఇమేజ్ ను మళ్లీ పొందేందుకు.. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచేందుకు ఈ సారి చంద్రబాబు ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సి ఉంది. అమరావతి రాజధానిగా, విశాఖను ఐటీ హబ్ గా, రాయలసీమను తయారీ రంగ కేంద్రంగా మార్చాలన్న పట్టుదలతో ప్రత్యేక ప్రణాళికలతో ఈ సారి చంద్రబాబు టీం దావోస్ లో పర్యటించనుంది.