ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామలు… కళ్ల ముందు జరుగుతున్న పరిణామాలు, వీడియో సాక్ష్యాలు ఉన్నప్పటికీ అరాచక శక్తులకు పోలీసులు అండగా ఉండి బాధితులపైనే కేసులు పెట్టడం.. అందులో పోలీసులే ఫిర్యాదు దారులుగా ఉండటం వంటివి ఓ పథకం ప్రకారం జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా పోలీసు వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు పెంచి.. సమాజంలో ఓ రకమైన అలజడి తీసుకు వచ్చే కుట్రను పాలకులు అమలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కింది స్థాయి పోలీసులు ఉన్నతాధికారుల సూచనలను పాటించక తప్పదు. వారేమి చేయాలంటే అది చేయాల్సిందే.
కళ్ల ముందు విధ్వంసం – బాధితులపైనే హత్యాయత్నం కేసులు !
ఏదైనా ఇలాంటి సంచలన ఘటన జరగాలనుకున్నప్పుడు… ఎలాంటి ఆదేశాలు వస్తాయో పోలీసు శాఖలోనే కథలు కథళుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇటీవల పోలీసులే టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. అసలు ఓ వైపు దాడులు, దహనాలు జరిగినా అలాంటి అరాచకశక్తులపై కేసులు పెట్టడం లేదు. కానీ వాటిని ప్రతిఘటించిన వారిపై కేసులు పెడుతున్నారు. గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిదంని తెలిసి పట్టాభి వెళ్లారు. ఆయనను పోలీసులు అడ్డుకుని తీసుకెళ్లారు. ఆయన కారుపై దాడి చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆయనపైనే హత్యాయత్నం కేసులు పెట్టారు. ఇతర నతేలపైనా పెట్టారు. కానీ సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయినా ఒక్క వైసీపీ కార్యకర్తపైనా కేసులు పెట్టలేదు.
అరాచకాలు మొత్తం పోలీసుల కనుసన్నల్లోనే – వ్యవస్థ మొత్తం బలహీనం
నాలుగేళ్లుగా పోలీసుల పని తీరు ఇంతే ఉంది. ఇప్పుడు మరింత పెరిగింది. విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రి రోజా మిడిల్ ఫింగర్ చూపించి రెచ్చగొడితే జనసేన కార్యకర్తలు చెప్పులు విసిరారు. కానీ అదే అదనుగా అక్కడ లేని వారిపైనా కేసులు పెట్టారు. రెచ్చగొట్టిన రోజాపై ఏ చర్యలు లేవు. కానీ ఇతర ఘటనల్లో మాత్రం దాడులు చేస్తూంటే అడ్డుకున్నా రెచ్చగొట్టారని కేసులు నమోదు చేస్తున్నారు. ఆనపర్తి, కుప్పం, మాచర్ల,, నర్సరావుపేట.. ఇలా ఎక్కడ చూసినా బాధితులపైనే కేసులు పెడుతున్నారు. పోలీసులే ప్రధానంగా ఫిర్యాదు దారులవుతున్నారు. సీఐలు, డీఎస్పీలు కేసులు పెడుతున్నారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న వ్యవహారం.
పోలీసులపై ప్రజలకు నమ్మకం తగ్గించే భారీ కుట్ర !
పోలీసులను ప్రతిపక్ష పార్టీకి శత్రువుగా మార్చి.. వారు ఎట్టి పరిస్థితుల్లో తమకు అనుకూలంగా పని చేయాలని..లేకపోతే టీడీపీకి బలైపోతారన్న ఓ భయం కల్పించడానికి వ్యవస్థను బలహీనం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు శాఖలోనూ దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. కొంత మంది పోలీసు అధికారులకు ఇష్టం లేకపోయినా ఈ తరహా రాజకీయ క్రీడలో భాగం అయిపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా నేర మనస్థత్వం ఉన్న పాలకుడి చేతిలో పోలీసులకు ఎప్పుడూ లేని వింత అనుభవాలు ఎదురవుతున్నాయని ఇది ఎటు వైపు దారి తీస్తుందో కాలమే చెప్పాలని నిపుణులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.