చంద్రబాబు పల్నాడు టూర్‌కు వెళ్తానంటే ఇంటికి తాళ్లేసి కట్టేస్తారు. లోకేష్ నర్సరావు పేట వెళ్తానంటే దారిలో అరెస్ట్ చేశారు. చంద్రబాబు విశాఖ వస్తే… విమానాశ్రయంలో నడి రోడ్డు మీద నిలిపివేసి.. వైసీపీ వాళ్లు చెప్పులు, రాళ్లు వేయడానికి పర్మిషన్ ఇస్తారు. ఇలా చెప్పుకోవాలంటే… పోలీసులు వైసీపీ నేతలు అరాచకాలు చేయడానికి రక్షణగా నిలబడి… విపక్షాల ప్రజాస్వామ్య ధర్నాలపైనా పోలీస్ మార్క్ కుట్రలు చేయడం.. లెక్కలేనన్ని. తాజాగా విశాఖలో పవన్ పర్యటన కూడా అంతే.
ప్రతిపక్ష నేతల్ని వేధించడం.. అడ్డుకోవడానికే ఏపీ పోలీస్ వ్యవస్థ వినియోగం
విశాఖ ఎయిర్ పోర్టులో జరిగింది చాలా చిన్న ఇష్యూ. రోజా అనే మహిళా మంత్రి ఉద్దేశపూర్వకంగా జనసేన కార్యకర్తల్ని ఎయిర్ పోర్టులో రెచ్చగొట్టినట్లుగా వీడియోలో స్పష్టంగా ఉంది. ప్లాన్ ప్రకారం జరిగిందో.. యాధృచ్చికంగా జరిగిందో… కానీ పోలీసులు ఆ ఘటనను దృష్టిలో పెట్టుకుని మొత్తం పవన్ కల్యాణ్ పర్యటనను నిలిపివేయడం ఏమిటి?. వందలు.. వేల మంది పోలీసుల్ని మోహరించి ఆయన తన రాజకీయ కార్యక్రమాలు చేపట్టకుండా అడ్డుకోవడం ఏమిటి ?. అసలు ఫోర్స్ మొత్తం పవన్ కల్యాణ్‌ను హోటల్ గదికి పరిమితం చేయడానికి వాడుకోవడం… ఏమిటి? ఇంత దారుణమైన పోలీసింగ్ ఎక్కడైనా ఉంటుందా ?
చిన్న ఘటనతో వందల మంది అరెస్ట్.. పవన్ నిర్బంధం ! విపక్ష నేతలపై దాడులు జరిగితే భావ ప్రకటనా స్వేచ్ఛ !
పవన్ పర్యటిస్తే ఏదో జరిగిపోతుందని.. ప్రభుత్వం భయపడటం.. ఆయన పర్యటించకుండా చూస్తామని పోలీసులు భరోసా ఇచ్చినట్లుగా వ్యవహరించడం విశాఖలో స్పష్టంగా కనిపించింది. పవన్ ప్రజలకు భరోసా ఇస్తే.. ప్రభుత్వానికి ఎందుకు భయం ? విశాఖను దోచేసిన విషయం పవన్ కల్యాణ్ బయట పెడితే తప్పా ప్రజలకు తెలియదా ?. పోలీసు వ్యవస్థను పూర్తి స్థాయిలో వైసీపీ అనుబంధ సంస్థగా మార్చి వాడుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతిపక్ష నాయకుల్ని నిర్బంధించడం.. వేధించడం… నియంత్రించడానికే పోలీసు విధులు ఉన్నాయి. అందులే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇలా తయారయింది. చివరికి పోలీసులే ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటు చేసుకుని వైసీపీకి ఎక్కడ నొప్పి తగులుతుందో తెలుసుని మరీ.. నిజమైన వాటిని కూడా ఫేక్ అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
నిజాల్ని కూడా ఫేక్లుగా చెప్పేందుకూ తిప్పలు !
ఇదే సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్నారు . అప్పట్లో పోలీసులు ఎంత నిజాయితీగా వ్యవహరించారో ఇప్పటి పోలీసుల వ్యవహారశైలిని బట్టి తెలుసుకోవచ్చు. పోలీసులకు జీతం ఇచ్చేది ప్రజలు.. ప్రజాధనం. ఆ ప్రజల పట్ల… తాము పోలీస్ సర్వీస్‌లోకి వచ్చిన ఆశయాల పట్ల కాస్తంతైనా పట్టింపు ఉండాలి. లేకపోతే వ్యవస్థకు ద్రోహం చేసినట్లే.