బీజేపీ పెద్దలు ఏపీ గురించి ఆలోచించలేకపోతున్నారు. ఏపీలో పొత్తుల అంశం తేల్చడానికి కూడా వారికి తీరిక ఉండటం లేదు. ఉన్న ఒక్క శాతం లోపు ఓట్లు… వాటిని పెంచుకునేందుకు.. కనీస ప్రయత్నం చేయకుండా ఏదో ఓ పార్టీకి అంకితమయ్యే నేతల తీరుతో.. బీజేపీ హైకమాండ్ అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. పొత్తులు పెట్టుకుంటే… నాలుగైదు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు వస్తాయి. అంతకు మించి ప్రయోజనం కనిపించడం లేదు. కానీ కూటమి పరంగా చూస్తే.. బలమైన పార్టీ కూటమిలో చేరుతుంది. అదొక్కటే… పొత్తులు వద్దులే అని అనుకోలేకుండా చేస్తోంది.
టీడీపీ, జనసేన సీట్ల విషయంలో బీజేపీని సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆ పార్టీ పొత్తులోకి వచ్చినా మూడు పార్లమెంట్, నాలుగు అసెంబ్లీ సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీ నుంచి వారు ఆశిస్తున్నది మాత్రం.. వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేసేలా చూడటం. పొత్తులో చేరిన తర్వాత కూడా జగన్ రెడ్డి ఆర్థిక అక్రమాలు..పోలీసువ్యవస్ధ దుర్వినియోగం, రాజ్యాంగ అతిక్రమణలు జరిగినా చూస్తూ ఉంటే.. పొత్తు వల్ల ప్రయోజనం ఉండకపోగా నష్టం జరుగుతుంది. ఈ విషయంలో టీడీపీ, బీజేపీ కూటమి క్లారిటీ కోరుతోంది.
ఏపీ గురించి సమావేశాలు పెట్టేంత తీరిక ప్రస్తుతానికి బీజేపీ పెద్దలకు లేదు. దేశం మొత్తం ఎన్నికల ప్రణాళికల్లో ఉన్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ వస్తే.. మొదటి విడతలోనే ఏపీ, తెలంగాణలో ఎన్నికలు పూర్తయిపోతాయి. అందుకే… మరో వారంలో ఏదో ఓ నిర్ణయం తీసుకోవచ్చన్న అంచనాకు వస్తున్నారు. కూటమిలో బీజేపీ చేరితే. .. దానికి తగ్గట్లుగా జగన్ రెడ్డికి నట్లు బిగించే చర్యలు కూడా కొని తీసుకోవాల్సి ఉంటుంది.