బూతులు తిడితే ఊపు తెచ్చుకునే నాయకుడు… ఆ నాయకుడికి శాటిస్ ఫేక్షన్ కల్పించి తమ జాబ్ ను కాపాడుకునేందుకు ఆడ., మగ అనే తేడా తెలియకుండా నోరు చేసుకునే వందిమాగధులు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రాటుదేలిపోయారు. ఎవరెంత క్రియేటివ్ గా బూతులు మాట్లాడుతారో వారికే వీరతాళ్లు పడతాయి. బూతులు మాట్లాడటం ఇష్టం లేకపోతే.. వేరే పార్టీ చూసుకోవాల్సిందే. ఇటీవల జనసేనలో చేరిన ఓ నాయకుడు తాను బూతులు మాట్లాడలేనని.. ఎదుటి పార్టీ నేతల్ని అలా తిట్టలేదనే తనను పట్టించుకోలేదని ఆవేదన చెందాడు. అది నిజమేనని బూతు పార్టీలో రోత రాజకీయాలు చేసే వారందరికీ తెలుసు.
బూతు పార్టీలు ఇప్పుడు నాయకులు ఎవరు అంటే… బండ బూతులు మాట్లాడే ఓ మంత్రి… గతంలో ఓ మాజీ మంత్రి ఉండేవారు. ఆయనకు తిట్టి తిట్టి అలుపు వచ్చేసింది. ఈయనకు పదవి వచ్చేసింది. అంతే ఆయన బాధ్యత ఈయన తీసుకున్నారు. చిన్నా, పెద్దా తేడా లేదు.. ఎవరి ముందు మాట్లాడుతున్నామో.. ఎక్కడ మాట్లాడుతున్నామో చూసుకోలేరు. శాటిస్ఫై చేయాల్సిన పర్సన్ ఎదురుగా ఉంటే లేకపోతే.. తన పర్మెర్మాన్స్ ఆయనకు చేరుతుందనే తెలిస్తే చాలు.. ల.. భాష ఎత్తేసుకుంటారు.
నాలుగేళ్ల నుంచి ఇదే తంతు. అలా మాట్లాడితేనే పదవులు వస్తాయని సంకేతాలు వచ్చాయి. బరి తెగించి మాట్లాడిన వాళ్లు పదవులు తెచ్చుకుంటున్నారు. దాన్ని నిలబెట్టుకోవడానికి మరింతగా బూతులు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ పార్టీలో వారు మాత్రమే కనిపిస్తున్నారు. ఇంకెవరూ తెర ముందు కనిపించడం లేదు. కాస్త సబ్జెక్ట్ ఉన్న బుగ్గన లాంటి వాళ్లు అసలు కనిపించరు. ఎందుకంటే వాళ్లకు బూతులు రావు. పదవుల కోసం ఇప్పుడు వేరే వాళ్లను బూతులు తిట్టి.. తాము తిట్టించుకుని కుటుంబాలను సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఎందుకని .. పార్టీ కోసం కష్టపడినా చాలా మంది సైలెంట్ గా ఉండిపోతున్నారు.
అయినా నోరు అందరికీ ఉంటుంది. గౌరవంగా బతకాలనుకునేవారు… ఒకరిని అని.. తనను అనిపించుకోవడం ఎందుకనుకున్న వారు.. సంప్రదాయ రాజకీయాలు చేసుకుంటారు. కానీ ఎదుటివాళ్లని బూతులు తిడితే తప్ప.. తమకు అన్నం సహించదనే రోత రాజకీయాలు చేసుకునే మనస్థత్వం ఇప్పుడు రాజ్యమేలుతోంది. అందుకే… బూతు పార్టీ.. రోత రాజకీయాల కాలం వచ్చింది . అవినీతి కేసులో జైలుకెళ్లినా ఏ మాత్రం సిగ్గుపడని లీడర్… వేరే వాళ్లని తిట్టించి రివర్స్ లో తన కుటుంబాన్ని రోడ్డుకీడ్చుకున్నా పట్టించుకోరు…కానీ ఇతర నేతల సంగతేంటి..? వారికి పరువు.. మర్యాదలు అక్కర్లేదా ?. బూతు పార్టీలో చేరే రోత రాజకీయాలతో… క్యారెక్టర్ అనేది లేకుండా చేసుకుంటున్నారు … మగ నాయకులు… ఆడనాయకులు కూడా.