మీకు మూడేళ్లలో లక్షలు ఇచ్చామని వైసీపీ నేతలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అన్ని లక్షలు ఇస్తే రేషన్ బియ్యం ఎందుకు తింటామయ్యా అని ఆ పేదలు బయటకు చెప్పుకోలేక… నవ్వుతూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. మాట్లాడితే రేషన్ బియ్యం కూడా అందకుండా చేస్తారేమోనని భయం. ఇప్పుడు టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని చెబుతున్న మొత్తానికి రెట్టింపుగా పన్నులు వసూలు చేశారని ఇంటింటికి లెక్క విడుదల చేయబోతున్నారు.
ఓ ఇంటికి యాభై వేల లబ్ది చేకూరిందని ప్రభుత్వం చెబితే.. .. ఈ మూడేళ్లలో ఆ ఇంటి నుంచి కనీసం లక్షన్నర వరకూ పన్నులు అదనంగా పిండుకున్నారన్న విషయాన్ని టీడీపీ నేరుగా ఆ లబ్దిదారునికి వివరింగా తెలియడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. నలుగురు సభ్యులు ఉన్న మధ్యతరగతి కుటుంబ నిత్యావసర ఖర్చు నాలుగేళ్ల కిందట నెలకు ఐదు వేలు ఉంటే.. ఇప్పుడు అది పదిహేను వేలకు చేరుకుంది. ఉచితంగా వచ్చిన ఇసుక అత్యంత ఖరీదైయింది. ఇంటిపన్నులు.. ఆ పన్నులు… ఈ పన్నులు … వడ్డించి.. మధ్యతరగతి నడ్డి విరిచేశారు. ఇలాంటి విషయాలన్నింటినీ జనరలైజ్ చేయకుండా… ఇంటింటికి ఇంత వసూలు చేశారని లెక్క చెప్పాలని టీడీపీ నిర్ణయించింది.
పదకొండో తేదీ నుంచి మా నన్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్ ను అన్ని ఇళ్లకు అంటించాలని నిర్ణయించారు. దీనికి పోటీగా టీడీపీ ప్రజల్ని.. కుటుంబాలను చైతన్యవంతం చేయాలని నిర్ణయించుకున్నారు. పథకం పేరుతో రూపాయి ఇచ్చి… రూ. వెయ్యి పన్నుల పేరుతో పిండుంకుంటున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఎక్కువగా ఉంది.. మద్యం ధర ప్రభావం ఎక్కువ కుటుంబాలపై ఉంది. మద్యం అలవాటు ఉన్న వారి కుటుంబాలు చితికిపోయాయి. వారికి ప్రభుత్వం గురించి చెప్పడానికి టీడీపీ సిద్ధమవుతోంది.