ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసిన విషయం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే ఆర్బీఐ అప్పు ఇవ్వాల్సిన స్థితికి వచ్చింది. ఇంకో రెండు నెలలు పోతే ఆర్బీఐ కూడా అప్పు ఇవ్వదు. మళ్లీ ఢిల్లీ వెళ్లి కాళ్లా, వేళ్లా పడి రాష్ట్ర ప్రయోజనాల గురించి తాము ఒక్క మాట కూడా మాట్లాడబోమని.. రావాల్సిన నిధులు గురించి కూడా అడగబోమని అప్పు ఇస్తే చాలని బతిమాలుకుని అదనపు అప్పులు తెచ్చుకోవాలి. ఇలాంటి స్థితిని దివాలా అనక ఏమంటారు ?
దివాలా కబుర్లు చెప్పి దొరికిపోయిన దువ్వూరి కృష్ణ
దువ్వూరి కృష్ణ.. ప్రభుత్వ సలహాదారు. ఓ ఆర్థిక వేత్త ఏపీ ఆర్థికంగా ఎత్తిపోయిందని చెబితే ఆయన.. ప్రైవేటు వీడియోలు పాటలు పాడుతున్నవి, డాన్సులు చేస్తున్నవి తీసుకొచ్చి చూపించి ఇలాంటి వాళ్లా ప్రభుత్వాన్ని విమర్శించేది అంటూ వీడియో చూపించారు. ఆర్థిక వ్యవహారాలపై మాట్లాడాలంటే ఓ అర్హత ఉండాలన్నారు. మరి నీ అర్హత ఏంది భయ్యా అని జర్నలిస్టులు అడిగితే.. తాను సలహాదారునని గొప్పగా ప్రకటించారు. అది సరే.. ఏ అర్హతతో సలహాదరు అయ్యావు.. నీ చదువేంది.. అర్హత ఏంది అంటే మాత్రం నోరు పెగల్లేదు. జీవీ రావు ఆర్థిక వేత్త అయితే టిక్ టాక్ వీడియోలు చేయకూడదన్నట్లుగా మాట్లాడి తమ ఆలోచనల్లో దివాలని దువ్వూరి కృష్ణ బయ పెట్టారు.
కార్పొరేషన్లు అయిపోయాయి ఇప్పుడు ప్రాజెక్టుల పేరుతో రుణాలు !
కార్పొరేషన్ల పేరు పెట్టి విచ్చలవిడిగా బయటకు కనిపించని రుణాలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రుణాలు తీసుకొస్తోంది. సీమ ప్రాజెక్టును చూపించి రెండున్నర వేల కోట్ల రుణాన్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ , రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ కడతారా బటన్ నొక్కడానికి వాడతారా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే పోర్టుల పేరుతో తెచ్చిన రుణాల్ని కూడా వాడేశారని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ.. ప్రజా ఆస్తి ఏ ఒక్కటి కనిపించినా తాకట్టు పెట్టేస్తున్నారు. చివరితి తాగుబోతుల్నీ తాకట్టు పెట్టేశారు.
రూ. 50వేలు బిల్లులు చెల్లించలేని దుస్థితిని దివాలా కాక మరేమంటారు ?
ప్రభుత్వానికి పని చేసిన ఏ ఒక్కరికీ బిల్లులు చెల్లించడం లేదు. రూ.యాభై వేల బిల్లులు పెండింగ్లో ఉన్నా కోర్టుకెళ్లాల్సి వస్తోంది. పనులు చేసిన కాంట్రాక్టర్లు కోర్టులకు వెళ్లాల్సి వస్తోంది. కొంత మంది కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ చిల్లర చేష్టలకు లెక్కేలేదు. ఆర్థికంగా ఏపీని దివాలా తీయించడమే కాకుండా… కోలుకుండా చేయడానికి జగన్ సర్కార్ చేయగలిగినంత చేస్తోంది. ఇంకా బుకాయించడానికి రూ. లక్షలు ఇస్తూ పెట్టుకున్న బుర్ర లేని సలహాదారుల్ని తెరపైకి పంపుతోంది.