ఆంధ్రప్రదేశ్ కరెంట్ సంక్షోభంలో కూరుకుపోతోంది. నేరుగా కోతలు విధిస్తే ప్రజలు చేతకాని వాడనుకుంటారని భావిస్తున్నారేమో కానీ చతెప్పకుండా కోతలు విధిస్తున్నారు. అది కూడా గంట… రెండు గంటలు కాదు.. ఏకంగా ఆరు నుంచి పది గంట కరెంట్ కోత అమలవుతోంది. సిటీల వరకూ కాస్త రిలీఫ్ ఇస్తున్నా… పల్లెలను అసలు వదిలి పెట్టడం లేదు. ఈ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. బుధవారం రాత్రి రాష్ట్రం మొత్తం కరెంట్ కోతలతో అల్లాడిపోయింది. ఆస్పత్రుల్లో ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. చంటి బిడ్డలను నిద్రపుచ్చలేక ఇబ్బందులు పడ్డారు. మరో వైపు పంటలు ఎండిపోతున్న రైతుల దుస్థితి మరింత దారుణం.
అనంతపురం జిల్లా చినీ రైతు ఒకరు కరెంట్ ఆఫీసు వద్దకు వచ్చి చినీ తోట ఎండిపోతోందని గుండెలు పగిలేలా ఎడుస్తున్న వీడియో అందర్నీ కలచి వేస్తోంది.ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు కనీసం విద్యుత్ పరిస్థితిపై సమీక్ష చేసే వారు కూడా లేరు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా విద్యుత్ ఉత్పత్తి సరిపడనంత లేకపోగా.. విద్యుత్ ఎక్సేంజీలలో కొనే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
యూనిట్‌కూ రూ. పన్నెండు కట్టి కొనాల్సిన పరిస్థితి వస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో చేయడానికి ఏమీ లేకుండాపోతోంది. ప్రభుత్వం ఈ సమస్య లేదన్నట్లుగా.. పట్టించుకోనట్లుగా ఉంటే చాలన్నట్లు వ్యవహరిస్తోంది. దీంతో సమస్య రెట్టింపవుతోంది కానీ.. తీరడం లేదు. సమస్యను పరిష్కరించడం అంటే.. ఆ సమస్యను పట్టించుకోకపోవడం అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉండటం ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. మీడియా కూడాఎక్కడా ఈ సమస్యల్నిప్రస్తావించడం లేదు. మంత్రి వర్గంపైనే మాట్లాడుతోంది.