ఆంధ్రప్రదేశ్ లో సహజవనరు అయిన ఇసుకను అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే..అసలు దోచేస్తోంది ప్రజల ఆస్తుల్ని కాపాడాలని అధికారాన్ని కట్టబెట్టిన నేతలే. ఏపీ ప్రభుత్వ పెద్దలే అడ్డగోలుగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. వారికి అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. కోర్టుల ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదు.
గత ప్రభుత్వంలో లోడింగ్, రవాణా ఖర్చులు పెట్టుకుని అవసరానికి తగినంత ఇసుకను ప్రజలు తీసుకెళ్లే అవకాశం ఉండేది. జగన్ రెడ్డి సీఎం అయ్యాక.. ఆరు నెలలు మొత్తం ఇసును ఆపేసి… ఆ తర్వాత అసలు దోపిడీ ప్రారంభించారు. ఈ ఇసుక స్కాం వల్ల భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తర్వాత వ్యవస్థీకృత దోపిడీ ప్రారంభించారు. జేపీ అనే సంస్థకు తవ్వకాల కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ ఉత్తదే. ఆ సంస్థ అసలు ఏపీలో అడుగు పెట్టనే లేదు. ఆ సంస్థ పేరుతో మరో సంస్థకు సబ్ లీజుకు ఇచ్చారని కథలు చెప్పారు. నిజానికి జిల్లా ల వారీగా … పంచేశారు. వారి వద్ద నుంచి నేరుగా నగదు వసూలు చేశారు. ఆ డబ్బులు చెల్లించలేక గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పటికీ ఓ సంచలనం.
జేపీ సంస్థ స్టాక్ మార్కెట్ కు తెలియచేస్తున్న వివరాలను టీడీపీ నేత పట్టాభి బయటపెట్టారు. అదే సమయంలో ఇసుక సత్యాగ్రహం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఇసుక దందాలు చేస్తున్న చోట్లను పరిశీలించారు. మొత్తం కొండలు, గుట్టలుగా ఇసుకను సేకరించి ఉన్నారు. ప్రభుత్వానికి మాత్రం .. డబ్బులు చేరడం లేదు. జేపీ సంస్థ పేరుతోనే బిల్లులు ఇస్తున్నారు. కానీ ఆ సంస్థ తాము సబ్ లీజుకు ఇచ్చామని చెబుతున్నారు. మరి దొంగ బిల్లులు ఇస్తోంది ఎవరో తేల్చాల్సి ఉంది. మొత్తంగా ఏపీలో ఇసును అడ్డగోలుగా మేసేస్తున్నారు.
ప్రజల ఆస్తుల్ని కాపాడటం… ప్రభుత్వాలు చేయాల్సిన పని . ఇంత బహిరంగంగా దోచుకోవడం … ఎవరూ చేయలేరు. కానీ ప్రజల్ని అత్యంత దారుణంగా…. రెండు వేలు ఇస్తే ఓటేస్తారన్నట్లుగా చూస్తున్న అధికారపార్టీ పెద్దలు మాత్రం… తమకు అలవాటైన పనిని అధికారం అండతో యథేచ్చగా చేసేస్తున్నారు.