ఢిల్లీలో లిక్కర్ స్కాం ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కడ మద్యం విధానం మార్చి పెద్ద ఎత్తున లంచాలు పొందారని అక్కడి ఆప్ ప్రభుత్వంలోని పెద్దలపై ఆరోపణలు వస్తున్నాయి. నిన్న సీబీఐ రంగంలోకి దిగింది. రేపు ఈడీ కూడా అడుగుపెట్టనుంది. ఇంతా చేసి అక్కడ జరిగినట్లుగా చెబుతున్న స్కాం విలువ రూ. 150 కోట్లు మాత్రమే. కానీ ఏపీలో వేల కోట్ల లిక్కర్ పాలసీ స్కాం జరుగుతోంది. అంతా బహిరంగమే. కేంద్రానికి తెలియని విషయలేం లేవు. కానీ ఎందుకు సైలెంట్‌గా ఉంటోందన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్న.
ఏపీలో లిక్కర్ మాఫియా అంతా ఒకే ముఠా గుప్పిట్లో !
ఏపీలో లిక్కర్ పాలసీని సీఎం జగన్ పూర్తిగా మార్చేశారు. దేశంలో ఎక్కడా అమ్మని.. అమ్మడానికి పర్మిషన్ కూడా ఇవ్వని లిక్కర్‌ను ఏపీలో బినామీ కంపెనీల ద్వారా తయారు చేసి అమ్మిస్తున్నారని టీడీపీ అనేక ఆధారాలు బయట పెట్టింది. ఎంత మేర ప్రజలను పిండుకుంటున్నారో వివరించింది. మొత్తం ప్రభుత్వం చేతుల్లో అంటూ.. నేరుగా సొంత వ్యాపారం చేస్తున్నారని.. వేల కోట్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కానీ కేంద్రం నుంచి ఇంత వరకూ ఎలాంటి స్పందన రాలేదు.
మందు బాబుల్ని నిలువుదోపిడి చేసేలా ధరలు !
ఒకప్పుడు టీడీపీ హయాంలో.. కేవలం ఇరవై రూపాయలు ఉండే మద్యం క్వార్టర్‌ను అరవై రూపాయలకు అమ్ముతున్నారని ఉండవల్లి లాంటి వాళ్లు పెట్టిన ప్రెస్మీట్లు వైరల్ అయ్యాయి. నిజానికి ఆయన చెప్పినది ప్రముఖ బ్రాండ్. కానీ ఇప్పుడు లోకల్ మేడ్.. ఎలా తయారు చేస్తారో కూడా తెలియని లిక్కర్‌ను రూ. పది కి కొని కనీసం రెండు వందలకు అమ్ముతున్నారు. ఆ లిక్కర్ తయారీ దారులు.. సరఫరా దారులు… ట్రాన్స్ పోర్టర్లు అందరూ బినామీ కంపెనీలే. వైసీపీ కార్యకర్తలను అమ్మకానికి ఉద్యోగులుగా పెట్టుకున్నారు.
ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్సే స్కాంకు పక్కా ఆధారం !
కేవలం నగదు లావాదేవీలు మాత్రమే… లిక్కర్ షాపుల్లో జరుగుతున్నాయంటే..ఎంత పెద్ద స్కాం చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. కాస్త విచారణ జరిపిదితే… వేల కోట్ల స్కాం వెలుగులోకి వస్తుంది. ఇదంతా బహిరంగమే. కానీ కేంద్రం కానీ.. దర్యాప్తు సంస్థలు కానీ పట్టించుకోవడం లేదు. ఢిల్లీలో నూట యాభై కోట్ల స్కాం జరిగిందనేసరికి… విపరీతంగా హడావుడి చేస్తున్నారు. కానీ వేల కోట్ల స్కాములకు పాల్పడుతున్న వారి జోలికి మాత్రం వెళ్లడం లేదనే నిష్టూరం ప్రజల్లో ఇందుకే కలిగేది.