అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ వైదొలగడంతో.. చాలా మంది పారిశ్రామికవేత్తలు.. ఆంధ్రప్రదేశ్‌పై జాలి చూపిస్తున్నారు. ఇక .. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులతో ఎవరు వస్తారని.. అక్కడి యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని.. విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో… సోషల్ మీడియాలో.. చురుగ్గా ఉండే పారిశ్రామికవేత్తలు, బిజినెస్ రంగ నిపుణులు.. తమ అభిప్రాయాలను దాచుకోవడం లేదు. అక్షయపాత్ర కో ఫౌండర్, ఇన్ఫోసిస్ సహా.. పలు దిగ్గజ కంపెనీలకు.. డైరక్టర్‌గా పని చేసిన మోహన్ దాస్ పాయ్.. ఈ విషయంలో.. ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా పోస్ట్ చేశారు. అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ వైదొలగడం.. ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత చెడు వార్త అని.. పాయ్ ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సింగిల్ హ్యాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేస్తున్నారని తేల్చేశారు. ఈ నిర్ణయం వల్ల.. ఇక పెట్టుబడిదారులు ఎవరైనా ఏపీ వైపు రావడానికి ఇష్టపడరని తేల్చేశారు.
పలువురు పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు కూడా… ఏపీ సర్కార్ తీరుపై.. ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏం చేస్తోందని… ఇలాంటి ప్రాజెక్టులు నిలిపివేయడం వల్ల.. ఎంత నష్టం జరుగుతుందో.. ప్రభుత్వం ఎందుకు అంచనా వేయలేకపోతోందని.. ప్రశ్నించారు. ఈ నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్ని దారుణంగా మార్చేస్తుందని… అభిప్రాయపడ్డారు. నిజానికి సింగపూర్ తో స్టార్టప్ ఏరియా ఒప్పందాన్ని.. దేశ పారిశ్రామిక వర్గాలు ఓ గేమ్ చేంజర్ గా చూశాయి. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే.. దేశంలో ఓ కొత్త మోడల్ వ్యాపార సామ్రాజ్యం అవిష్కృతమవుతుందని.. సింగపూర్ తరహా అభివృద్ధి సాధ్యమవుతుందని.. భావించారు. కానీ అలాంటి ప్రాజెక్టుకే.. ఏపీ కొత్త ప్రభుత్వం మంగళం పాడేసింది.
నిజానికి ప్రభుత్వం మారినప్పటికీ… అమరావతిలో సింగపూర్ స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయడానికి సింగపూర్ ఆసక్తిగానే ఉంది. కానీ అమరావతి ఒక్క సామాజికవర్గానిదంటూ.. అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుని.. ఆ సామాజికవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ.. బలపడనీయకూడదంటూ.. ప్రభుత్వం.. సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతిలో … ఒక సామాజికవర్గమే లేరని.. అందరూ ఉన్నారని.. రాజధానిగా అది అందరికీ చెందుతుందన్న విశాలమైన భావనకు మాత్రం ప్రభుత్వం రాలేకపోయింది. ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఈ పరిణామాలు ఏపీలో పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే విషయాన్ని పారిశ్రామికవేత్తలు సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు