పెట్టుబడిదారుడు ఓ ప్రాంతం వైపు చూడాలంటే ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాడు?. ముందుగా ఆ రాష్ట్రం ఇమేజ్ ను చూసుకుంటాడు. అక్కడకు వెళ్తే మన వ్యాపారం సులువుగా జరిగిపోతుందని.. ఇబ్బందులు రావని అనుకుంటే…పేరును షార్ట్ లిస్టు చేసుకుంటాడు.లేకపోతే అసలు పట్టించుకోడు. అలాంటి ఇమేజ్ కోసం ఏ రాష్ట్రమైనా ప్రయత్నాలు చేయాలి. వైసీపీ హయాంలో పదేళ్ల పాటు అసలు దావోస్‌కు వెళ్లిందే లేదు. ఓ సారి వెళ్లిన జగన్.. అక్కడ పెట్టుబడిదారుల డౌట్లను తీర్చే సమావేశంలో పాల్గొని.. అడిగిన ప్రశ్నలకు ఇట్స్ ఏ లెంగ్తీ క్వశ్చన్ అని చెప్పి.. ఇతనా ప్రభుత్వాధినేత అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు.
అంతర్జాతీయ పెట్టుబడుల విషయంలో జగన్ చేసిన నిర్వాకాలు ప్రతీ సారి అక్కడ ఏపీ ఇమేజ్ ను దెబ్బతీశాయి. ఏపీని కామెడీ చేసేవారు. ఇప్పుడు ఆ ఇమేజ్ ను మార్చి.. మళ్లీ ఏపీ ఇన్వెస్టర్ల ఫ్రెండ్లీ అనిపించుకునేలా ప్రయత్నం చేయడానికి ఏపీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ హయాంలో పదేళ్ల పాటు అంతర్జాతీయ పెట్టుబడిదారులతో టచ్‌లో ఉండేందుకు ఎప్పటికప్పుడు దావోస్ సదస్సు ద్వారా ప్రయత్నాలు చేసేది. ఇప్పుడు ఏపీలో పరిస్థితులు మారాయని.. అందరికీ చెప్పేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా దావోస్‌లో ఏపీ గ్రోత్ స్టోరీని విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
దావోస్ లో పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుని.. మెటీరియలైజ్ చేసుకుని ఏపీలో మంచి గ్రోత్ సాధిస్తున్న కంపెనీలు.. వాటి యాజమాన్యం అభిప్రాయాలతో గ్రోత్ స్టోరీని ప్రచారం చేస్తున్నారు. ఎనిమిది మంది బృందంతో దావోస్ వెళ్తున్న చంద్రబాబు టీం..అక్కడ ఈ గ్రోత్ స్టోరీని విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. పెట్టుబడిదారుల రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఏపీని ప్రమోట్ చేయనున్నారు. గత ఐదేళ్ల పాలన నీడను తీసేసి.. భవిష్యత్ అంతా బంగారమే అన్న నమ్మకాన్ని కల్పించేందుకు ప్రయత్నించనున్నారు.