ఏపీలో పోస్టింగ్‌ల కోసం.. ప్రమోషన్ల కోసం దారి తప్పిన ఉద్యోగులు.. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పోలీసులు .. కొన్ని వేల మంది ఉన్నారు. వీరంతా ప్రధాన ప్రతిపక్షాన్ని వేధించడానికే ఎక్కువగా తమ అధికార దుర్వినియోగం చేశారు. ఖచ్చితంగా అందరికీ అట్టుకు అట్టున్నర ఇస్తామని టీడీపీ,జనసేన ప్రకటించాయి. అయితే ఇలా రూల్స్ ఉల్లంఘించిన వారిపై సాదాసీదా చర్యలు తీసుకోవడం ఉండవని….నేరుగా మాస్ డిస్మిస్లు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
<span style="color: #ff0000"ముందుగా కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారు డిస్మిస్ !
ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టు అత్యున్నతం. కానీ ఏపీలో కోర్టు ఉత్తర్వులను పట్టించుకుంటున్న వారు లేరు. కొన్ని వేల కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ఉత్తర్వులు అమలు చేయాల్సిన అధికారులు, ఉద్యోగులు అమలు చేయలేదు. అమలు చేయవద్దని ప్రభుత్వ పెద్దల మౌఖికమైన ఆదేశాలు ఉండవచ్చుకానీ.. అది చెల్లదు. అమలు చేయని అధికారులతో తప్పు. అందుకే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన అధికారులందర్నీ మొదటి జాబితాలో… అతి వేగంగా డిస్మిస్ చేసే అవకాశం ఉంది. దీని వల్ల కొన్ని వేల ఖాళీలు ఏర్పడతాయి.
<span style="color: #ff0000"అధికార పార్టీ అండతో అక్రమాలపై పాల్పడిన వారిపై తదుపరి వేటు !
ఇక అధికార పార్టీ అండతో అక్రమాలకు పాల్పడిన అధికారులు లెక్క లేనంత మంది ఉన్నారు. వారి ఆస్తులు ఐదేళ్లలో ఇబ్బడిమబ్బడిగా పెరిగిపోయాయి. ఏ శాఖలో ఉన్నప్పటికీ.. ప్రభుత్వ పెద్దల సామాజికవర్గానికి చెందిన వారు దందాలతో చెలరేగిపోతున్నారు. వారందరికీ సంబంధిచిన వివరాలు బయటకు తీసి… ఫాస్ట్ ట్రాక్‌లోనే విచారణ జరిపి.. డిస్మిస్ చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అన్ని శాఖల్లోనూ ఇలాంటి ఉద్యోగులు ఉన్నారని… ప్రతి నియోజకవర్గం నుంచి ఇప్పటికే జాబితా రెడీ చేసుకున్నారని చెబుతున్నారు.
<span style="color: #ff0000"ఓటర్ల జాబితా అక్రమాలపై పాల్పడినవారికి స్పాట్ డిస్మిస్ ఆర్డర్స్
ఇక ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. పై స్థాయి అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఈసీ చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ నేతలు కోర్టుకెళ్తే కొంతమందిపై చర్యలు తీసుకున్నారు. కానీ అక్రమాలకు పాల్పడిన ప్రతి అధికారి రికార్డు టీడీపీ నేతల దగ్గర ఉంది. పైగా అవన్నీ ఆధారాలు లేనివి కాదు. పూర్తి స్థాయి ఆధారాలతో ఉన్నవే. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారి ఓట్ల ప్రక్రియలో అధికార దుర్వినియోగం చేయాడనికి డిస్మిస్ శిక్ష వేయవచ్చు. ఈ కారణంతో కొన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు.
<span style="color: #ff0000"పోలీసు విభాగంలో ఎక్కువ ఖాళీలు
పోలీసు విభాగం పూర్తిగా వైసీపీ జేబు సంస్థలా మారిపోయింది. కానిస్టేబుళ్లు.. టీడీపీ తరపున పోస్టులు పెట్టే వారిని కూడా వదలడం లేదు. ఇలాంటి వారందర్నీ… టీడీపీ ఇప్పటికే హైలెట్ చేసుకుంటోంది. గతంలో అనంతపురంలో ప్రభుత్వనికి వ్యతిరేకంగా పోరాటం చేశారని ఓ కానిస్టేబుల్ ను డిస్మిస్ చేశారు. ఆ తరహాలో ప్రభుత్వం రాగానే.. చట్టాన్ని ఉల్లంఘించిన వారందరికీ ఊస్టింగ్ ఆర్డర్స్ ఖాయమని భావస్తున్నారు.
మొత్తంగా.. లక్షకుపైగా ఉద్యోగాలు ఖాళీ అవుతాయని.. వాటికి తోడు మరో లక్ష ఉద్యోగాల భర్తీతో .. పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ ను టీడీపీ, జనసేన ప్రభుత్వం రిలీజ్ చేసే చాన్స్ ఉందని ఉద్యోగార్థులు అంచనా వేస్తున్నారు.