ఏపీ ఆర్థిక పరిస్థితిని తేల్చడానికి చంద్రబాబు ప్రభుత్వం కిందా మీదా పడింది. చివరికి అప్పును రూ. 13 లక్షల కోట్లకుపైగానే ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో లక్షన్నర కోట్ల మేర పెండింగ్ బిల్లులు ఉననాయి. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించనున్నారు. అంతర్జాతీయ, జాతీయ సంస్థల రుణాలు కాకుండా 2019 మార్చి నాటికి 3.75 లక్షల కోట్ల వరకు రుణం ఉండగా, ఇప్పుడు ఆ రుణం 9.82 లక్షల కోట్లు దాటిపోయింది. ఇందులో కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులే 2.48 లక్షల కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ఎడిటర్స్ కామెంట్ : ట్యాక్స్ మంటల్లో మిడిల్ క్లాస్
పలు ప్రభుత్వ పథకాల కోసం రిజర్వ్ బ్యాంకు, జైకా, ఆసియన్ డెవలప్మెరట్ బ్యాంకు, హడ్కో, నబార్డ్ వంటి సంస్థల నుంచి తీసుకున్న రుణాలు మరో మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల వరకూ ఉంటాయి. మొత్తం రుణం 13 నుంచి 14 లక్షల కోట్ల వరకు చేరుకుంటుందని ప్రకటించే అవకాశం ఉంది. ఈ రుణాల్లో అత్యధిక కాస్త ఆలస్యంగా చెల్లింపులు చేయవచ్చు. కేంద్రం కొంత మొత్తం చెల్లిస్తుంది. అయితే ఇంత భారీగా తెచ్చిన అప్పులు ఎలా ఖర్చు పెట్టారన్నది ప్రభుత్వం ప్రకటించనుంది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో జరిగిన అభివృద్ధి, ఆ తరువాత 2019 నుంచి 2024 మధ్యలో నెలకొన్న సంక్షోభాన్ని చంద్రబాబు వివరించనున్నారు.
అప్పుల కోసం … ప్రతి ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెట్టారు. ఆ తాకట్టు పెట్టిన ఆస్తుల వివరాలతో పాటు అప్పులు తెచ్చి ఆ డబ్బులు ఏం చేశారన్నది కూడా చంద్రబాబు వివరించనున్నారు. ప్రజా ధనాన్ని సొంత ధనంలా వాడుకున్న వైనాన్ని చంద్రబాబు స్పష్టంగా వెల్లడించే అవకాశం ఉంది.