ఔనన్నా.. కాదన్నా… రాజకీయాల్లో కుల సమీకరణాలదే పెద్ద పీట. దీన్ని ఇప్పుడు… కొత్తగా సోషల్ ఇంజినీరింగ్ అని పిలుచుకుంటున్నారు. ఈ సామాజిక సమీకరణాలు.. తెలుగు రాష్ట్రాల్లో చాలా భిన్నంగా ఉంటున్నాయి. తెలంగాణలో ఇప్పుడు.. ఓ భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారం కోసం పదే పదే పోరాడిన … రెడ్డి, కమ్మ సామాజికవర్గాలు.. ఇప్పుడు .. తెలంగాణలో కలసి పని చేస్తున్నాయి. ఈ విషయంలో భిన్నాభిప్రాయం లేదు. కమ్మ సామాజికవర్గ ఓటర్లు.. చాలా క్లియర్ గా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. వారిని కదిపితే.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనుకుంటున్నారంటే… వాళ్లు చెప్పే మాట.. రేవంత్ రెడ్డి లేకపోతే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎవరైనా రెడ్డి సామాజికవర్గమే. కానీ విచిత్రంగా… అదే రెడ్డి సామాజికవర్గం… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి..మహాకూటమికి వ్యతిరేకంగా పని చేస్తోంది. తెలంగాణ రెడ్డి సామాజికవర్గం… పూర్తిగా కేసీఆర్ తమను తొక్కేశారన్న భావనలో ఉన్నారు కొంత కాలంగా రెడ్డి సామాజికవర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుని జరిగిన దాడుల పట్ల వారు సంతోషంగా లేరు. కానీ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సామాజికవర్గ ఓటర్లు మాత్రం… వేరే అభిప్రాయంతో ఉన్నారు. వారంతా.. టీఆర్ఎస్ ను బలపరుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని కోసం ప్త్రత్యేకంగా మీటింగులు కూడా పెట్టారని చెబుతున్నారు. మహాకూటమి గెలిస్తే.. అది ఏపీలో చంద్రబాబునాయుడు బలపడటానికి కారణం అవుతుందన్న భావనతో.. ఏపీకి చెందిన.. రెడ్డి సమాజికవర్గం నేతలు.. తెలంగాణలో… మహాకూటమి గెలవకూడదనుకుంటున్నారు. కేసీఆర్ .. మళ్లీ ముఖ్మమంత్రి కావాలనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాజీయాల్లో సోషల్ ఇంజినీరింగ్ ఎంత క్లిష్టంగా ఉంటుందో… దీని ద్వారా తెలుస్తుంది. రెడ్డి సామాజికవర్గం నేతలు.. రాష్ట్ర విభజన తరవాత రెండు విధానాలుగా విడిపోాయారు. తెలంగాణలో అధికారంలోకి రాకుుండా చేయాలని.. ఏపీ రెడ్డి నేతలు కోరుకుంటున్నారు. కానీ … కమ్మ సామాజికవర్గం మాత్రం… తెలంగాణలో రెడ్లు అధికారం చేపట్టడానికి .. పూర్తి సహకారం అందిస్తోంది. కానీ.. ఏపీ రెడ్లు మాత్రం.. కేసీఆర్ సీఎం కావాలనుకుంటున్నారన్న ఇంజినిరింగ్ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.