ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తమ కూలీ మీడియాలో పని చేసే వారికి చివరి రోజుల్లో పదవులు కట్ట బెట్టేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. సాక్షి కన్నా ఘోరంగా వైసీపీ కోసం ఫేక్ న్యూస్ ప్రచారం చేసే ఎన్టీవీకి చెందిన సీఎంవో బీట్ చూసే రిపోర్టర్ రెహానాకు సమాచార కమిషనర్ పోస్టును ఇచ్చారు. నిబంధనల ప్రకారం పలు విషయాల్లో అత్యంత నిపుణులైన వారికే ఈ పదవి ఇవ్వాలి. కానీ రాజకీయ పార్టీలను సమర్థించే వారికి కట్ట బెట్టడం కామన్‌గా మారిపోయింది.
నిబంధనలకు అనుగుణంగా ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ సమాచార కమిషనర్లను ఎంపిక చేయాల్సి ఉంది. చంద్రబాబు విజయవాడలో లేని సమయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక్క రోజులో సమావేశానికి రావాలని సూచించారు. రెండు వారాల సమయం చూసి.. సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించినా పట్టించుకోలేదు. రెహానాను నియమిస్తూ.. నిర్ణయం తీసేసుకున్నారు. దీన్ని గవర్నర్ ఆమోదించి ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంది.
పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. సమాచార కమిషనర్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమానంగా జీతభత్యాలు లభిస్తాయి. రెహానా సీఎంవోలోకి నేరుగా వెళ్లగలిగేంత నమ్మకస్తురాలిగా వైసీపీ కోసం పని చేశారు. ఆ మధ్య మరో టీవీ 9 జర్నలిస్టు హసీనాతో గొడవపడి వివాదాస్పదమయ్యారు.