రాజకీయాల్లో హుందాతనం ఆ నాయకుడి పేరును రెట్టింపు చేస్తుంది అంటారు. నచ్చకపోతే కక్షగట్టడం, తను చెప్పినట్లు వింటే నెత్తినపెట్టుకోవటం కాదు… హుందాగా, రూల్స్ ప్రకారం పనిచేసుకుపోయే అధికారులను ప్రోత్సహించటం పరిపాలనలో ముఖ్యం. సరిగ్గా చంద్రబాబు సీఎం అయ్యాక అదే చేస్తూ, పరిపాలనలో ఆయనకంటూ విజన్ ఉంటుంది అనే మాటను నిజం చేస్తున్నారు.
ఏపీలో గత ప్రభుత్వ హయంలో అధికారులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించిన ఉదాంతాలు ఎన్నో. అధినేత జగన్ మెప్పు కోసం టీడీపీ-జనసేన నాయకులను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో చంద్రబాబు అధికారంలోకి రాగానే కొందరు సెలవుపై వెళ్లగా, కొందరిని బదిలీ చేశారు.
ఎన్నికల సమయంలో సీఎస్ గా పనిచేస్తూ… వైసీపీ కోసం పనిచేశారన్న ఆరోపణలున్న జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. సీఎస్ చంద్రబాబు సీనియర్ అధికారి నీరబ్ కుమార్ ను నియమించారు. ఈ నెలాఖరున జవహర్ రెడ్డి రిటైర్ కావాల్సి ఉన్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఐపీఎస్ ఏబీతో వ్యవహరించినట్లే వ్యవహరిస్తుందని వైసీపీ ప్రచారం చేసింది. కానీ, చంద్రబాబు పాలన వేరు… పార్టీ వేరు అన్నట్లుగా హుందాగా వ్యవహరిస్తూ, ఈ నెలాఖరున రిటైర్ కావాల్సి ఉన్న జవహర్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.
జవహర్ రెడ్డి మాత్రమే కాదు సీఎం జగన్ గా ఉన్నప్పుడు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన పూనం మాలకొండయ్యకు కూడా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఉన్న ఆమెకు జీఏడీ స్పెషల్ సెక్రెటరీగా పోస్టింగ్ ఇచ్చారు. ఈమె కూడా ఈ నెలాఖరున రిటైర్ కాబోతున్నారు.
కెరీర్ చివర్లో బాధపడకుండా ఉండేందుకు, వైసీపీతో అంటకాగినా… చంద్రబాబు హుందాగా నడుచుకొని, అధికారులకు గౌరవం ఇచ్చారని… మంచి సంప్రదాయమని సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.