అంగన్వాడి మహిళలు ప్రభుత్వంపై పోరాడుతున్న వైనం అన్ని వర్గాల్లోనూ స్ఫూర్తి నింపుతోంది. ప్రభుత్వంపై పోరాటంలో ఏ మాత్రం రాజీ పడటం లేదు. ఎస్మా ప్రయోగించి అరెస్టులు చేస్తామన్నా తగ్గడం లేదు. వారు చేస్తున్న పోరాటం చాలా స్వల్ప ప్రయోజనాల కోసమే.. అదీ కూడా సీఎం ఇచ్చిన హామీ మేరకే.
ఘోరంగా మోసం చేసినా ఇంకా రోడ్డెక్కలేకపోతున్న ఉద్యోగులు
అదే సీఎం ఇచ్చిన హామీలు, న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కలేకపోతున్నారు. కనీసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి భయపడుతున్నారు. తమకు నష్టం చేసిన ప్రభుత్వంపై ఉద్యోగ సంఘ నేతలు ప్రశంసలు కురిపిస్తూ..సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు. కానీ ఉద్యోగులు మాత్రం రోడ్డెక్కలేకపోతున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ రెడ్డి చేసిన మోసం గతంలో ఎవరూ చేయలేదు. పీఆర్సీని తగ్గించిన చరిత్ర ఉన్న సీఎం.
సొంత ప్రయోజనాలు చూసుకుని వైసీపీకే మద్దతుగా ఉద్యోగ సంఘం నేతలు
గత ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీని రివర్స్ చేసి.. డీఏలను మొత్తం అందులో కలిపి ఇస్తున్నట్లుగా నాటకాలు ఆడి.. ఒక్కో ఉద్యోగికి లక్షల్లో నష్టం చేశారు. సీపీఎస్ రద్దు పేరుతో నాటకం ఆడి… రద్దు చేసేది లేదని కేంద్రంతో ఒప్పందం చేసుకుని వేల కోట్ల అప్పులు చేసి జల్సా చేస్తున్నారు. అయినా ఉద్యోగులు ప్రశ్నించలేకపోతున్నారు. టీచర్లు కొంత వరకూ పోరాడినా ఇతర ఉద్యోగులు వెన్నుపోటు పొడవడంతో.. తగ్గిపోయారు. ఇప్పుడు నోరెత్తడం లేదు.
ఐదేళ్లలో 62 శ ాతం జీతం పెంచిన చంద్రబాబు – జగన్ రెడ్డి తగ్గించాడు !
2014లో రాష్ట్ర విభజన జరిగి నతర్వాత చంద్రబాబు 42 శాతం పీఆర్సీ ఇచ్చారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లే ముందు చంద్రబాబు 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చి.. పీఆర్సీని నిమయంచారు. ఈ ఐదేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపు అయినా… జగన్ రెడ్డి మాత్రం ఉద్యోగుల జీతాలు తగ్గించారు. ఉత్తుత్తి పీఆర్సీని నియమించారు. ఇలా ఘోరమైన మోసాలు చేస్తున్నా.. ఇప్పటికీ ఉద్యోగులు పోరాటం ప్రారంభించలేదు.
ఇలాగే ఉంటే వచ్చే ప్రభుత్వాలూ పట్టించుకోవు !
తాము దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వడం లేదని బొప్పరాజు లాంటి వాళ్లు మాట్లాడుతున్నారు కానీ… అవి తమ ప్రయోజనాల కోసం… మాత్రమే. ప్రభుత్వం దగ్గర ఏదో ఫైల్ ఉండి ఉంటుంది.. దాన్ని క్లియర్ చేసుకోవడానికిఇలా బ్లాక్ మెయిలింగ్ కి దిగుతూ ఉంటారు. ఉద్యోగులు మాత్రం వీరిని నమ్ముతూ… సైలెంట్ గా ఉంటున్నారు. ఇలాగే ఉంటే… వచ్చే ప్రభుత్వంలోనూ వీరు తమ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కోల్పోతారు.