ఒక్క బటన్ నొక్కి జగన్ రెడ్డిని ఇంటికి పంపడానికి అంగన్వాడీలకు బటన్ పవర్ ఉంది. తనకు అధికారం ఉందని జగన్ రెడ్డి వారిని చీకట్లో అణిచివేసే ప్రయత్నం చేశారు. నానా బాధలు పెట్టారు. ఇచ్చిన హామీల్ని అమలు చేయమంటే వేదించారు. బెదిరించారు. మహిళలని చూడకుండా… ఘోరమైన వేధింపులకు దిగారు. ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరించో.. మరొకటో వారిని ఉద్యమం నుంచి విరమింపచేయవచ్చు కానీ.. వారిలో ఉన్న ఆగ్రహం నుంచి జగన్ రెడ్డి తప్పించుకోవడం కష్టం.
పాదయాత్రలో అంగన్వాడిలకు ఇచ్చిన హామీల మేరకు ప్రయోజనాలు కల్పించకపోగా పథకాలు కూడా వర్తించకుండా చేశారు. చివరికి గుర్రాలతో తొక్కించే పరిస్థితికి వెనుకాడలేదు. గతంలో అంగన్నాడి మహిళలు జగన్ రెడ్డికోసం పని చేశారు. ఊరూవాడా ప్రచారం చేశారు. చంద్రబాబు పెంచింది కాకుండా.. జగన్ రెడ్డి వస్తే డబుల్ అవుతుందని ఆశ పడ్డారు. చివరికి వారి ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పుడు తమకూ ఓ బటన్ ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ఒక్క అంగన్వాడిలే కాదు జగన్ రెడ్డి మోసం చేసిన వారి జాబితాలో లెక్క లేనన్ని వర్గాలు ఉన్నాయి. అందరూ రోడ్డెక్కారు. తమ అసంతృప్తిని తెలియచేశారు. వారందరి మదిలోనూ ఒక్కటే ఉంది.త తమకూ బటన్ పవర్ ఉందని.. దాని సంగతి చూస్తామని. ఆ బటన్ నొక్కి జగన్ రెడ్డికి బుద్ది చెప్పేందుకు ఇంకా ఎంతో సమయం లేదు.