పోలవరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం మెల్లగా చేతులెత్తేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కేంద్రం ఆమోదించిన పాత ధరలకు తాము కట్టలేమని.. జనవనరుల మంత్రి అనిల్ కుమార్ మీడియా ముందు తేల్చి చెప్పేశారు. సహాయ, పునరావాసాలకే రూ. 30వేల కోట్లు అవుతుందని… కేంద్రం ఇస్తామంటున్న నిధులతో ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తవుతుందని ప్రశ్నించారు. అనిల్ స్పందన చూస్తూంటే.. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి.. కేంద్రమే కట్టాలని.. పూర్తిగా కాడి దించేసే ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం మారగానే హడావుడిగా.. రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్‌ను మార్చేసిన ప్రభుత్వానికి ప్రస్తుతం.. కేంద్రం ఇచ్చిన షాక్‌తో.. మొత్తం ఆ ప్రాజెక్ట్‌ను కేంద్రానికి వదిలేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
దేశంలో ఇప్పటికి ఎన్నో జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ వేటికీ.. కేంద్రం నిధులు కేటాయిందు. దశాబ్దాల తరబడి ఆ ప్రాజెక్టులు నత్త నడకన సాగుతూ ఉంటాయి. కానీ నీతి ఆయోగ్ సూచనతో.. నిర్మాణ పర్యవేక్షణను తీసుకున్న గత ప్రభుత్వం.. శరవేగంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది. నిధుల కొరత వెంటాడుతున్నా.. బడ్జెట్లో కేటాయించి మరీ.. పనులు చేయించింది. గత ప్రభుత్వం చేయించిన పనులకు సంబంధించి.. ఈ ప్రభుత్వానికి .. రూ. మూడు వేల కోట్ల రీఎంబర్స్మెంట్ కూడా వచ్చింది.
ఆ నిధులను సర్కార్ మరో దానికి ఉపయోగించుకుంది. ఇప్పుడు… కేంద్రంపై ఒత్తిడి చేసి. .. పోలవరం టెక్నికల్ కమిటీ ఆమోదించిన రూ. 50వేల కోట్ల ప్రతిపాదనలను ఆర్థిక శాఖతో ఆమోదింపచేసుకోలేక… పూర్తిగా చేతులెస్తోంది. టీడీపీదే తప్పని.. పోలవరంను అటకెక్కించడానికి ఏపీ సర్కార్ రెడీ అయినట్లుగా.. తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.