బ్రదర్ అనిల్ కుమార్ ఏపీలో రాజకీయ భేటీలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఉద్దేశంతో ఆయన ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. రాజకీయ పార్టీపై ఆయన సంకేతాలు ఇస్తున్నారు. కానీ నిజంగా రాజకీయ పార్టీ పెడతారా అన్నది చాలా మందికి డౌట్ గానే ఉంది. ఎందుకంటే… బ్రదర్ అనిల్ ఎప్పుడూ రాజకీయాల్లో లేరు. ఆయన మత ప్రచారంలో ఉన్నారు. ఈ క్రమంలోఆయన వైసీపీ కి సహకరించారు. నిజంగా రాజకీయ పార్టీ పెట్టేంత ఆలోచన అనిల్ చేయరు. కానీ షర్మిల చేస్తారు.
షర్మిలకు ఏపీలో రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం ఉంటే ఆమె తెలంగాణలో ఏర్పాటు చేసేవారు కాదు. కానీ కుటుంబ పరంగా జరిగిన ఒప్పందాల కారణంగా ఆమె తెలంగాణలో రాజకీయ భవిష్యత్ వెదుక్కున్నారు. కుటుంబంలో జరిగిన చర్చల వల్ల ఆస్తులు.. ఇతర విషయాల్లో పంపకాలు జరిగాయని..ఏపీలో జగన్.. తెలంగాణలో షర్మిల రాజకీయాలు చేసుకోవాలని ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. అయితే జగన్ ఒప్పందం ప్రకారం ఆస్తులు పంచకపోవడంతో.. ఇప్పుడు ఏపీలోనూపార్టీ పెట్టాలని షర్మిల అనుకంటున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఏపీలో పార్టీ పెట్టకూడదనే ఒప్పందం ఏమీ లేదుగా అని ఓ సందర్భంలో నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
తెలంగాణలో షర్మిల పార్టీని పట్టించుకునేవారే లేరు. భారీగా ఖర్చు పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు. కనీసం రెండు శాతం ఓట్లు వస్తాయని కూడా ఎవరూ అంచనా వేయడం లేదు. ఈ క్రమంలో ఏపీలో అయితే కాస్తంత రాజకీయ పలుకుబడి ఉంటుందని నమ్ముతున్నారు. అందుకే ఏపీకి షిప్టయ్యే ఆలోచనలో ఉన్నారు. ఒప్పందం ప్రకారం జగన్ ఆస్తుల పంపంకం పూర్తి చేస్తే ఆ ఆలోచన కూడా మానుకుంటారని అంచనా వేస్తున్నారు. ఇది కేవలం.. జగన్కు ఓ రకంగా బెదిరింపు లాంటిదేనని.. జగన్ జాగ్రత్త పడితకే పార్టీ పెట్టరని అంటున్నారు. జగన్ చేతిలోనే పార్టీ పెట్టాలా లేదా అన్నది ఉందని.. ఓ రకంగా బ్రదర్ అనిల్ సంకేతం పంపుతున్నారని అనుకోవవ్చు.