అనిల్ రావిపూడి… వరుస హిట్లతో క్రేజ్ తెచ్చుకొన్న కుర్ర దర్శకుడు. ఇప్పుడో మల్టీస్టారర్‌కి కథ సిద్ధం చేశాడు. దీనికీ దిల్‌రాజునే నిర్మాత. ఈ సినిమాలో వెంకీ నటిస్తున్నారని, మరో కథానాయకుడి పాత్ర సాయిధరమ్ తేజ్ చేస్తున్నాడని వార్తలొచ్చాయి. ఇవేం గాలి వార్తలు కాదు. స్వయంగా… దిల్‌రాజు సంస్థల మీడియా వ్యవహారాలు చూసే వ్యక్తులే సమాచారం అందించారు. కాబట్టి నూటికి నూరుశాతం ఈ ప్రపోజల్స్ నిజమే. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి మాత్రం… `కథ రెడీయే, కానీ ఇంకా ఎవరికీ చెప్పలేదు, హీరోలు డిసైడ్ కాలేదు` అంటున్నాడు. సడన్‌గా దిల్‌రాజు కాంపౌండ్ రివర్స్ గా మాట్లాడడం మొదలెట్టిందేంటో అర్థం కావడం లేదు. వెంకీ సడన్‌గా మాట మార్చుకొని, ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యాడా? అందుకే ఇప్పుడు హీరోలెవరోతెలీదు అంటూ.. అనిల్‌రావిపూడి చెబుతున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వెంకీ ఉన్నట్టుండి సడన్‌గా బిజీ అయిపోయాడు. తేజ సినిమా త్వరలో మొదలవుతుంది. ఈలోగా నాగచైతన్యతో ఓ మల్టీస్టారర్ మూవీకి పచ్చజెండా ఊపేశాడు. ఇప్పటికిప్పుడు వరుసగా మూడో సినిమా కూడా పట్టాలెక్కించడం కష్టం. ఇక్కడ రెండు విషయాలు జరిగి ఉండొచ్చు. ఒకటి… మూడో సినిమా చేసే టైమ్ లేకపోవడంతో వెంకీ ఈ సినిమా నుంచి తప్పుకోవొచ్చు. లేదంటే మరి కాస్త సమయం అడిగి ఉండొచ్చు. రావిపూడి వెంటనే నాలుగో సినిమా మొదలెట్టే మూడ్‌లో ఉన్నాడు. కాబట్టి… వెంకీ స్థానంలో మరో హీరోని వెదుక్కోవాల్సివస్తోంది. వెంకీ మారితే, సాయి ధరమ్ తేజ్ కోసం కూడా మరో ఆప్షన్ చూసుకోవాలి. అందుకే… హీరోల విషయంలో మాట మార్చి ఉండొచ్చు.