చిరంజీవి జోరు మామూలుగా లేదు. సినిమా తరవాత సినిమా చేసే చిరు – ఇప్పుడు ఒకేసారి నాలుగైదు కథల్ని ఓకే చెప్పేయడం చిత్రసీమని షాక్ కి గురి చేస్తోంది. ఆచార్య ఇంకా విడుదల కాకుండానే గాడ్‌ఫాదర్, భోళా శంకర్ చిత్రాల్ని పట్టాలెక్కించాడు చిరు. బాబి సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్లడానికి రెడీగా ఉంది. మారుతితో చిరు ఓ సినిమా చేయబోతున్నాడు. వెంకీ కుడుముల కథకీ.. చిరు ఓకే చెప్పాడన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ఇప్పుడు అనిల్ రావిపూడితో కూడా చిరు ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టు దాదాపుగా ఖాయమైపోయినట్టే.
వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఎఫ్ 3తో బిజీగా ఉన్న ఈ దర్శకుడు.. త్వరలోనే బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తరవాత… చిరంజీవితో సినిమా చేయడం ఖాయం. ఈలోగా… చిరు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాడన్నది పెద్ద ప్రశ్న. 2022లో చిరు నాలుగు సినిమాల్ని ఫినిష్ చేయాలని భావిస్తున్నాడట. 2022 చివర్లోనే… అనిల్ రావిపూడి సినిమా మొదలవుతుంది. 2022లో ఆచార్య వస్తుంది. భోళా శంకర్, గాడ్ ఫాదర్లు కూడా 2022లోనే. అది పూర్తవ్వగానే బాబి, మారుతి సినిమాలను ఒకేసారి మొదలెడతాడు. ఆ వెంటనే… అనిల్ రావిపూడి సినిమా ఉండొచ్చు.