బిగ్ బాస్ షో అట్టహాసంగా ముగిసింది. అభిజిత్ విజేతగా నిలవడంలో ఎవ్వరికీ ఆశ్చర్యం ఏమీ లేదు. ముందు నుంచీ అతనే హాట్ ఫేవరెట్. గ్రాండ్ ఫినాలేలో చిరంజీవి ప్రత్యేక అతిథిగా రావడం, మెహరీన్ లాంటి గ్లామరెస్ కథానాయికలు వేదికపై సందడి చేయడంతో ఈ షో మరింత ఆసక్తిగా సాగింది. అనిల్ రావిపూడి సైతం ఈ షోకి అతిథిగా వచ్చాడు.
ఈ షోకి వచ్చేవాళ్లంతా బిగ్ బాస్ టాపు.. తోపూ అంటూ మాట్లాడడం సహజం. ఆఖరికి బిగ్ బాస్ చూడకపోయినా సరే, `నేను బిగ్ బాస్ తప్ప ఇంకేం చూడను` అన్నట్టే మాట్లాడతారు. అనిల్ రావిపూడి మాత్రం ఈ విషయంలో పీహెచ్ డీ చేసేశాడు. బిగ్ బాస్ కే పెద్ద బిస్కెట్ వేశాడు. తాను బిగ్ బాస్‌కి వీరాభిమానినని చెప్పుకున్నాడు. నాగ్ అయితే… “బిగ్ బాస్ గురించి గూగూల్ లో వెదకాల్సిన పనిలేదు. అనిల్ రావిపూడిని అడిగితే చెప్పేస్తాడు. ఏ ఎపిసోడ్ లో ఏం జరిగిందో అతనికి కంఠతా వచ్చు..“ అంటూ బిల్డప్ ఇచ్చాడు. అతి పెద్ద బిస్కెట్ ఏమిటంటే.. ఓ రోజు `సరిలేరు నీకెవ్వరు` షూటింగ్ జరుగుతోందంటే.. అది ఆపేసి.. బిగ్ బాస్ షో చూడ్డంలో మునిగిపోయాడట అనిల్ రావిపూడి. మహేష్‌ని పక్కన పెట్టుకుని, `ఇప్పుడే వచ్చేస్తా.. అని బిగ్ బాస్ షో చూడ్డానికి వెళ్లిపోయాడట… ఇదీ నాగ్ చెప్పిన మాట. మహేష్ లాంటి స్టార్ ని పక్కన పెట్టుకుని టీవీలో ఓ రియాలిటీ షో చూడ్డానికి దర్శకుడు పరుగులు పెట్టాడంటే.. అంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. ఓ షోలో.. ఆ షో గురించి మాట్లాడడం వరకూ ఓకే. మరీ ఇలాంటి బిల్డప్పులే
ఓవర్ గా అనిపిస్తాయి.