మాస్ దర్శకుడు అనిపించుకోవం చాలా కష్టం. ఆ ఇమేజ్ వచ్చేస్తే.. ఇక హీరోలంతా వెంటపడతారు. ఎందుకంటే మనోళ్లంతా మాస్ హీరోలాయె. వాళ్లకు మాస్ దర్శకులే కావాలి. తొలి రెండు సినిమాలతోనే మాస్ కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు అనిల్ రావిపూడి. పటాస్ కమర్షియల్‌గా మంచి హిట్టు కొట్టింది. సుప్రీమ్లోనూ ఆ లక్షణాలు కనిపించాయి. అందుకే… అనిల్ రావిపూడి వైపు దృష్టి పెట్టారు మాస్ హీరోలు. తాజాగా అనిల్‌కి రవితేజ నుంచి పిలుపొచ్చిందని టాక్.
బెంగాల్ టైగర్ తరవాత కాస్త తేరుకొన్నాడు రవితేజ. త్వరలోనే చక్రి దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈలోగా మరిన్ని కథలు ఓకే చేయించుకోవాలనుకొంటున్నాడు. తాజాగా అనిల్‌ని ఫోన్ చేసి ”మంచి కథ ఉంటే చెప్పు.. చేద్దాం” అన్నాడట. స్టార్ హీరోల దృష్టిలో ఎప్పుడెప్పుడు పడదామా అని చూస్తున్న అనిల్‌రావిపూడి.. ఈ ఆఫర్‌తో ఎగిరి గంతేసినట్టు టాక్. దిల్‌రాజు బ్యానర్లో రవితేజ ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు. అయితే… అది ఎంతకీ పట్టాలెక్కడం లేదు. అనిల్ కథ ఓకే చేసేస్తే… దిల్‌రాజు బెంగ కూడా తిరిపోయినట్టుంటుంది.