డైరెక్టర్ అనిల్ రావిపూడి ఐడియాలు గమ్మత్తుగా వుంటాయి. ఆయన ఎంచుకునే కాంబినేషన్లు క్యాచిగా వుంటాయి. మాస్ పల్స్ పట్టుకునే టేస్ట్ ఆయనకి వుంది. ఆయన సినిమాల్లో పాటలు కూడా అప్పటికప్పుడు కిక్ ఇచ్చేలా వుంటాయి. నిజానికి పాటల విషయంలో ఆయనది మాస్ టేస్ట్. ఎఫ్3 సినిమాలో ‘కుర్రాడు బాబోయ్’ రీమిక్స్ కి థియేటర్ ఊగిపోయింది. వెంకటేష్ సినిమాల్లో ఏదో ఒక పాత తీసుకోవచ్చు. కానీ ఆయన సుమన్ ‘చిన్నల్లుడు’ సినిమాలో ఓ బిట్ ఎత్తుకున్నాడు. అది అనిల్ మాస్ టేస్ట్.
ఇప్పుడు ‘సంక్రాంతి వస్తున్నాం’ సిద్ధం చేస్తున్నాడు, పాటల పనులు జరుగుతున్నాయి. ఫస్ట్ సింగిల్ ని పాడించేశారు. ఈ పాట కోసం రమణ గోగులని తీసుకొచ్చారు. గోదారి గట్టు అనే ఈ సాంగ్ మాస్ ని ద్రుష్టిలో పెట్టుకొని చేసింది. రమణ గోగులది పెక్యులర్ వాయిస్. ఆయన వాయిస్ లో ఈ పాట ఖచ్చితంగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది స్టార్ సింగర్లు అందుబాటులో వున్నారు. వాళ్ళతో పాడిస్తే ఒక రెగ్యులర్ సాంగ్ అయ్యేది. కానీ రమణ గోగులని తీసుకురావడంతో దీనికో ప్రత్యేకత తీసుకొచ్చినట్లయింది. అన్నట్టు చివరిగా రమణ, వెంకీ లక్ష్మీ సినిమాకి పని చేశారు. 18 ఏళ్ల తర్వాత ఈ సినిమా కోసం మళ్ళీ జతకట్టారు.