ఈతరం దర్శకుల్లో.. వేగం కాస్త తగ్గిన మాట నిజం. ఏదైనా ఓ ప్రాజెక్టు చేతికొస్తే.. అమర శిల్పి జక్కన్నలా చెక్కే పని పెట్టుకుంటారు. స్క్రిప్టుకే చాలా కాలం పట్టేస్తోంది. ఓ హీరోతో సినిమా ఓ మొదలైందంటే, అది పూర్తయ్యేంత వరకూ మరో కథ ఆలోచించరు. అయితే అనిల్ రావిపూడి మాత్రం ఇలా కాదు. చాలా ఫాస్ట్… ఆమాటకొస్తే సూపర్ ఫాస్టు. తను తీసిన `ఎఫ్ 3` ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సినిమాకి మెరుగులు దిద్దే పనులున్నాయి. మరోవైపు బాలకృష్ణ కోసం ఓ కథ రెడీ చేసేశాడు. ఆమధ్య ఎన్టీఆర్ ని కలిసి ఓ లైన్ చెప్పాడు. `లైన్ బాగుంది.. డవలెప్ చేయ్` అన్నాడంతే… చక చక లైన్ ఆర్డర్ వేసేసుకుని, ట్రీట్మెంట్ కూడా పూర్తి చేసేసేశాడట. ఇక డైలాగ్ వర్షన్ రాయడమే తరువాయి. అనిల్ స్పీడు చూస్తుంటే… ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమాలు రెండూ సమాంతరంగా మొదలెట్టేసేలానే కనిపిస్తున్నాడు. కాకపోతే.. ఎన్టీఆర్ కి రెండు మూడు కమిట్మెంట్లు ఉన్నాయి. అవి అయ్యేంత వరకూ…. అనిల్ రావిపూడితో సినిమా పట్టాలెక్కదు. కొరటాల శివతో ఓ సినిమా ఉంది. ఆ తరవా బుచ్చిబాబుతో మరోటి. ఇవి రెండూ పూర్తయ్యాకే అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది. దీనికి దిల్ రాజు నిర్మాత.