నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబో సెట్టయ్యిపోయింది. సెప్టెంబరు నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఈలోగా అనిల్ రావిపూడి స్క్రిప్టు డెవలెప్ చేసుకోవొచ్చు. అయితే… బాలకృష్ణ మరో బాధ్యత కూడా ఇచ్చాడట. నట వారసుడు మోక్షజ్ఞని ఫిట్ గా తయారు చేసే బాధ్యత ఇప్పుడు రావిపూడిపైనే పడిందని తెలుస్తోంది.
ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ లుక్ మాత్రం అభిమానుల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. `మోక్షజ్ఞకి హీరో అవ్వాలని లేదా..` అంటూ అభిమానులు చాలాసార్లు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. మోక్షజ్ఞ బాగా లావుగా ఉండడమే అందుకు కారణం. అయితే.. ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీకి మెల్లమెల్లగా దారులు తెరచుకుంటున్నాయి. 2023లో తనతో తెరంగేట్రం చేయించాలని బాలయ్య ఫిక్సయ్యాడట. ఆ బాధ్యత ప్రస్తుతానికి అనిల్ రావిపూడిపై ఉంది. మోక్షజ్క్ష లుక్ ఎలా ఉండాలి? ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి? నటనలో శిక్షణ కోసం ఏం చేయాలి? ఈ విషయాలపై ఇప్పుడు రావిపూడి సలహాలు తీసుకొంటున్నాడట బాలయ్య. అన్నీ కుదిరితే.. మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యత కూడా రావిపూడికే అప్పగించే ఛాన్స్ ఉంది. మొన్నటి వరకూ బోయపాటి శ్రీను సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనుకొన్నారు. అయితే బోయాపాటి ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరవాత బన్నీ ప్రాజెక్టు ఉంది. ఆ వెంటనే బాలయ్యతో కాంబో చేయాలి. అందుకే బాలయ్య దృష్టి.. రావిపూడిపై పడిందని టాక్.